తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

పదే పదే వేడిచేసి తింటున్నారా.. అయితే ఇది చదవాల్సిందే..

చాలామంది ఆహార పదార్థాల్ని పదే పదే వేడి చేసి తింటుంటారు. అయితే అది మంచిదో కాదో తెలుసుకుందాం రండి.

hot food is healthy or not
ఊర్కూర్కే వేడి చేస్తున్నారా..

By

Published : May 10, 2021, 2:21 PM IST

  • తాజా కాయకూరల్ని వండినప్పుడే కొన్ని పోషకాలు పోతాయి. వాటిని రెండోసారి వేడి చేస్తే, తిన్నా ప్రయోజనం ఉండదు. అందుకే సరిపడినంత వండుకోవడం మేలు. అలాగే చికెన్‌ బిర్యానీ త్వరగా పాడవుతుంది. కాబట్టి దాన్ని వేడిచేసి తినకూడదు.
  • పాలను ఎక్కువసార్లు వేడిచేస్తే వాటిలోని సాల్యుబుల్‌ విటమిన్లతోపాటు పోషకాలు తగ్గుతాయి. అప్పుడు తాగినా వృథానే! కాబట్టి ఎన్ని పాలు అవసరమవుతాయో అన్ని మాత్రమే కాచుకుని తాగాలి.
  • కొంతమంది అన్నాన్ని ఫ్రిజ్‌లో పెడతారు. దాన్ని తీసి, అరకొరగా వేడిచేస్తారు. అయితే బియ్యంలో బ్యాక్టీరియా ఉంటుంది. అది వేడిచేసినప్పుడు వృద్ధి చెందుతుంది. కాబట్టి అన్నాన్ని ఎక్కువసేపు వేడిచేయాలి.
  • అదేవిధంగా మాంసాన్ని వేడిచేసేటప్పుడు కూడా ముక్కల మధ్యభాగం వేడేక్కెలా చేయాలి. ఒకసారి ఉడికించిన గుడ్డు రబ్బరులా సాగుతుంటే దాన్ని మళ్లీ వేడిచేయకూడదు.
    చివరగా.. ఏ పదార్థాన్నైనా వేడి చేసుకుని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి మితంగా వండుకోవడం ఉత్తమమైన పద్ధతి.

ABOUT THE AUTHOR

...view details