తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఇంట్లో తెలియకుండా వచ్చే దుర్వాసనకు చెక్ పెట్టేయండిలా..

ఒక్కోసారి ఇంట్లో దుర్వాసనులు వస్తుంటాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవడంతోపాటు వాటిని ఎలా పారదోలాలో చూద్దామా!

clean your house using these tips and reduce unknown smells
ఇంట్లో తెలియకుండా వచ్చే దుర్వాసనకు చెక్ పెట్టేయండిలా..

By

Published : Aug 27, 2020, 2:33 PM IST

  • సాధారణంగా చెత్తబుట్ట నుంచే దుర్వాసన వస్తుంటుంది. అలా రాకుండా ఉండాలంటే తడి, పొడి చెత్తలను వేర్వేరు వేయాల్సి ఉంటుంది. వీలైతే చెత్త బుట్టని ఇంటి బయటే ఉండేలా చూడండి.
  • చాలామంది ఇళ్లలో కుక్కలు, పిల్లులను పెంచుకుంటారు. అయితే వీటి జుట్టు ఊడిపోవడం, దాంట్లో ఉండే సూక్ష్మజీవుల వల్ల ఒకరకమైన దుర్వాసన వస్తుంది. అందుకే మంచం, సోఫాలపై ఉండే పెంపుడు జంతువు వెంట్రుకలను వాక్యూమ్‌ క్లీనర్‌తో శుభ్రం చేస్తే దుర్వాసన రాకుండా ఉంటుంది. తడిసిన దుస్తుల నుంచి వచ్చే మురుగు వాసన భరించలేం. మాసిన దుస్తులను స్నానాల గదిలో షవరు, నల్లా పక్కనో పెడితే నీళ్లు పడి తడిచిపోతాయి. బాస్కెట్‌లో వేసి దూరంగా పెట్టండి.
  • వారానికోసారి మంచంపైన ఉన్న దుప్పట్లు మార్చకపోయినా కూడా దుర్వాసన చికాకుపెడుతుంది. ముఖ్యంగా వానాకాలంలో వారానికోసారి ఉతికేస్తే మంచిది.

ABOUT THE AUTHOR

...view details