ఐస్‌క్రీమ్, డోనట్, బిస్కెట్, కప్‌కేక్, గుడ్డు... ఇలా ఇక్కడ రకరకాల రూపాల్లో కనిపిస్తున్నవన్నీ అవే మరి. ‘ట్వీ’ కంపెనీ తయారుచేసే ఈ చాక్‌లు వేరువేరు ఆన్‌లైన్ షాపుల్లోనూ దొరుకుతున్నాయి. వీటిని పిల్లలకిస్తే ఎంచక్కా అటు బొమ్మల్లానూ, ఇటు గచ్చుమీద గీసుకుంటూ కూడా ఆడుకుంటారు. ఈ చాక్‌పీసుల్లో ఇంగ్లిష్ అక్షరాలతో ఉన్నవీ వస్తున్నాయి.
ఆటబొమ్మలు కాదు చాక్‌పీస్‌లు! - sunday eenadu news
పిల్లలకు ఏదైనా రంగు రంగుల్లో ఆకర్షణీయమైన రూపాల్లో కనిపిస్తే ఎంత సంబరపడిపోతారో. కాబట్టే వాళ్ల బొమ్మలూ పెన్నులూ పెన్సిళ్లూ రబ్బర్లూ... ఇలా అన్నీ విభిన్నంగా వస్తుంటాయి. విచిత్రం ఏంటంటే... ఇప్పుడు ఆ కోవలోకి చాక్‌పీస్‌లూ చేరాయి.
![ఆటబొమ్మలు కాదు చాక్‌పీస్‌లు! attractive chalk piece items for kids](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11098240-699-11098240-1616320084911.jpg)
ఇవి... చాక్‌పీస్‌లు!