Girl's Role in Boy's Life : ఒక మగాడి జీవితంలో ఆడదాని పాత్ర చాలా కీలకం. బాధలో ఉన్నవాడికి ఓదార్పుగా.. సంతోషంలో ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని డబుల్ చేస్తూ.. అవసరమైనప్పుడు మంచి సలహాలిస్తూ.. దుందుడుకుతనంగా వ్యవహరిస్తూ ట్రాక్ తప్పినవాడిని దారిలో పెడుతూ.. కూతురిగా ప్రేమను పంచుతూ.. సోదరిలా అభిమానిస్తూ.. ప్రేయసిలా ఆనందాన్న కలిగిస్తూ.. జీవితభాగస్వామిగా అనుక్షణం వెంట నడుస్తూ.. అమ్మలా లాలిస్తూ ఇలా ప్రతి దశలో ఆడది మగాడికి తోడుగా నీడగా నడుస్తుంది. అలా ఓ కుర్రాడి జీవితంలో అమ్మాయి ఉంటే అతడికి ఎంత బెనిఫిటో ఓ సారి చూద్దామా..
ఓదార్పు :
Woman's Role in Man's Life : కుర్రాళ్లకి దూకుడు ఎక్కువైతే అమ్మాయిలకు ఓపిక జాస్తి. ఏం చెప్పినా సావధానంగా వింటారు. సమస్య పరిష్కారమయ్యే ఉపాయం ఆలోచిస్తారు. కష్టం ఎక్కువైతే భుజంపై చోటిచ్చి ఓదారుస్తారు. మనసుకి నచ్చే మాట చెబితే చిన్న హగ్ ఇచ్చి సంతోషం రెట్టింపు చేస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎమోషనల్ సపోర్ట్ అమ్మాయిల దగ్గర ఎక్కువ దొరుకుతుంది.
సంతోషం :
Women's Day Speciality: కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్పే కాదు.. సంతోషాలు, సరదాలు కావాలనుకున్నప్పుడూ వెనువెంటనే దొరికేది ఆడవాళ్ల దగ్గరే. వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ.. అంటూ గాళ్‌ఫ్రెండ్‌తో పంచుకున్నప్పుడు వచ్చే కిక్ ఎక్కడా దొరకదు.
సలహాదారు :