అవే గులాబీలు, అవే టెడ్డీ బేర్లు, అవే చాక్లెట్లు... ప్రేయసికి ప్రేమికుల రోజున గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారా...? ఆపండి.. ఇరవై ఏళ్లుగా ప్రేమికుల దినోత్సవం అంటే ఇవ్వే గిఫ్టులు ఇచ్చి వాటిలో కొత్తదనం మాట పక్కన పెడితే... ఈ కాలం అమ్మాయిలు మార్పు కోరుకుంటున్నారు. మరి ఇలాంటి కొత్త గిఫ్టులు ఇచ్చి మీరు ఇష్టపడేవారికి ఇచ్చి ప్రపోజ్ చేయండి
ఫోటోలన్ని కలిపి ఫోటో ఫ్రేమ్...
ఫోటో ఫ్రేము గిఫ్ట్‌గా ఇవ్వడం మామూలే... ప్రియురాలి ఫోటోలన్ని కలిపి ఒక ఫ్రేమును గిఫ్ట్‌గా ఇవ్వడం కొత్తదనం. వీటి కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. మీ చరవాణిలో ఫోటో ఎడిటింగ్ యాప్స్‌ను వాడితే సరిపోతుంది. ఫోటో స్టూడియోల్లో ఫ్రేము తయారు చేయించుకోవాలి.
బాటిల్లో ప్రేమలేఖ...
కొందరు తమ వన్ సైడ్ ప్రేమను ప్రేమిస్తున్నవారికి వ్యక్తం చేయలేరు. అంత ధైర్యం రాదు ఎందుకంటే నో చెప్తారేమోనని. అలాంటి వారు తమ భావాలను, ప్రేమను సరళమైన పదాలతో సూటిగా లేఖమీద రాసి చిన్న గాజు సీసాలో పెట్టి ప్రపోజ్ చేస్తే ఎవరు నో చెప్తారు చెప్పండి.