తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

భార్యాభర్తలు ఉద్యోగులైతే... ఇవి పాటించండి! - telangana news updates

ఆలుమగలు ఇద్దరూ ఉద్యోగులైతే...సమయాన్ని సర్దుబాటు చేసుకోవాలి. మాట్లాడుకునేందుకు సందర్భాలను సృష్టించుకోవాలి. అలాకాకుండా రోజులు గడిచిపోతుంటే... ఇద్దరిలోనూ అభద్రతాభావం పెరిగిపోతుంది. చిన్న చిన్న గొడవలు సైతం అగాథాన్ని సృష్టిస్తాయి.

భార్యాభర్తలు ఉద్యోగులైతే... ఇవి పాటించండి!
భార్యాభర్తలు ఉద్యోగులైతే... ఇవి పాటించండి!

By

Published : Mar 20, 2021, 9:56 AM IST

ఇద్దరూ వేరు వేరు షిప్ట్‌ల్లో వెళ్తున్నాం....ఒకరి ముఖం ఒకరు చూసుకునే తీరిక కూడా ఉండట్లేదా? అయితే కచ్చితంగా మీ వారాంతాన్ని ఒకే రోజు ఉండేలా కేటాయించుకోండి. అయితే చాలామందిలా మీరూ దాన్ని విశ్రాంతి దినంగా భావించేయొద్దు. రోజులో ఓ గంట సమయాన్ని పడుకోవడానికి కేటాయించినా మిగిలిన రోజులో సగం మీ ఇద్దరికోసం కేటాయించుకోండి.

  • రోజంతా ఎంత తీరిక లేకుండా గడిపేసినా సరే... కనీసం ఓ పూట భోజనమైనా ఇద్దరూ కలిసి తినండి. ఆ సమయంలో బయట విషయాల కంటే ఇద్దరికీ సంబంధించిన అంశాలను మాత్రమే చర్చించుకుంటే సరి. నిజానికి ఎంత చెప్పుకున్నా...ఒక అరగంట సమయం కంటే ఎక్కువ అవసరం లేదు కదా!
  • మీటింగ్‌లు, పని ఒత్తిడితో ఫోన్‌ చేసి మాట్లాడే సమయం లేనప్పుడు ఓ చిన్న మెసేజ్‌ పెట్టినా చాలు...అర్థం చేసుకుంటారు. అలానే జీవితం యాంత్రికంగా సాగిపోతున్నప్పుడు దగ్గర్లోని గుడికో లేదంటే...కనీసం రెండు రోజుల పాటూ విహారయాత్రకైనా వెళ్లిరండి. దాన్నుంచి బయటపడతారు. అంతేకాదు...భాగస్వామికి మీరిచ్చే చిన్న సర్‌ప్రైజ్‌లు మీ ప్రేమను పదిలపరుస్తాయి.

ABOUT THE AUTHOR

...view details