తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఆలూమగల అనుబంధంలో అభద్రత రానీయొద్దు.!

కుటుంబాలు వేరు.. నేపథ్యాలు వేరు.. అభిరుచులు వేరు.. ఇలా ఒకరికొకరు సంబంధం లేని ప్రపంచంలో బతికిన ఇద్దరు.. వివాహం అనే బంధంతో ఒక గూటికి చేరుతారు. భిన్నపార్శ్వాలున్నా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవనం సాగిస్తారు. కానీ ఎంత అన్యోన్యంగా అప్పుడప్పుడూ కలహాలు రాకుండా ఉండవు. మరి అలాంటి సందర్భాల్లోను సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రేమతో ఆ ఈగోలను జయించొచ్చు. మరి ఆ టిప్స్​ ఏంటో చూద్దామా..

By

Published : May 16, 2021, 12:24 PM IST

tips for wife and husband good relation
భార్యాభర్తల అనుబంధం పదిలంగా ఉండాలంటే

ఆలుమగల అనుబంధానికి ప్రత్యేక నియమావళి ఏమీ ఉండదు. పరిస్థితులను బట్టి సర్దుకోవాలి. ఇష్టాయిష్టాలను పంచుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అడుగులేయాలి. అప్పుడే జీవితం హాయిగా సాగిపోతుంది.

* కలిసి ప్రణాళిక:వేర్వేరు నేపథ్యాలున్న మీ అలవాట్లు కూడా అలానే ఉండి ఉండొచ్చు. అందుకని మీకునచ్చినట్లే ఎదుటి వారు చేయాలనే పంతం వద్దు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో పొదుపు, దుబారా వంటి అంశాలమీద ఎక్కువగా వాగ్వివాదాలు జరుగుతుంటాయి. మీ మధ్యా అలాంటివి వస్తుంటే... కలిసి కూర్చుని ప్రణాళిక వేసుకోండి. అప్పుడే చిన్న చిన్న సమస్యలు అదుపులోకి వస్తాయి. రాన్రానూ ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది.

* అభద్రత: ఒకరికొకరుగా జీవితాంతం ప్రేమానురాగాల మధ్య నడవాలి. ఒక్కోసారి చిన్న విషయమే అనిపించినా ఎదుటి వారిలో అభద్రతకు కారణం కావొచ్చు. అందుకే పారదర్శకంగా ఉండటానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ విషయంలోనే ఎదుటివారు అలా భావిస్తుంటే... అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అపార్థాలు, అపోహలు తొలగించుకునే ప్రయత్నం చేయండి. అప్పుడే అనుబంధం హాయిగా సాగిపోతుంది.

*ప్రేమించండి:కోపంతో సాధించలేని ఎన్నో పనులు ప్రేమతో చేయొచ్చు. ఎదుటివారిలో మార్పు కోరుకున్నప్పుడు మీరు చెప్పాలనుకునే విషయం కోపంతోనో, ఆవేశంతోనో కాకుండా సున్నితంగా చెప్పిచూడండి. ఉద్వేగాలతో ఎదుటి వారి కాళ్లకు బంధనాలు వేయడం వల్ల... ఇద్దరి మధ్యా అగాధం పెరిగే ప్రమాదం ఉంది. ప్రేమను వ్యక్తం చేయడంలో అందరి తీరూ ఒకేలా ఉండకపోవచ్చు. అర్థం చేసుకుని అడుగులేస్తే ఆనందమే.

ఇదీ చదవండి:లాక్​డౌన్ వల్ల సొంతూళ్లకు వలస కూలీలు..

ABOUT THE AUTHOR

...view details