తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

విమెన్స్​ డే స్పెషల్: మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం? - Women's Day 2021 Special Article

ఈరోజు మహిళా దినోత్సవం.. కనబడిన ప్రతి మహిళకు శుభాకాంక్షలు చెబుతాం. అసలు మహిళలకు ఒక ప్రత్యేకమైన రోజెందుకు? ఈ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం... ?

story on Why Celebrate Women's Day?
మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం?

By

Published : Mar 8, 2021, 6:30 AM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఏ దేశపు రాణీ పుట్టిన రోజో కాదు... ఒక సమష్టి విజయానికి ప్రతీక, సమానత్వం కోసం మహిళలు పోరాడి విజయపతాకం ఎగురవేసిన రోజు. ఒక వేతన పెంపు ఉద్యమం, ఒక అస్తిత్వవాద ఉద్యమంగా మారి స్త్రీ అంటే పిల్లల్ని కనటమో, లేదంటే ప్రేమ గీతాలకు పరవశించి పోవటమో కాదు. కార్మిక శక్తిగా తాము చేసే పనీ తక్కువ కాదని నిరూపించుకున్న రోజు. అందుకే ఇది కేవలం మహిళా దినోత్సవం కాదు.. శ్రామిక మహిళా దినోత్సవం!

అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం క్రమంగా శ్రామిక పదం కనిపించకుండా పోయింది. ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే.. మార్చి 8కి దాదాపు 162 సంవత్సరాల చరిత్ర ఉంది. అమెరికాలో 1857 మార్చి 8న మొట్టమొదటి సారిగా నిరసన చేపట్టారు. అక్కడి బట్టల మిల్లులోని మహిళా కార్మికులు.. తమ పని గంటలను 16 నుంచి 10 గంటలకు తగ్గించమని కోరుతూ.. వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేశారు.

1910 మార్చి 8న క్లారాజెట్కిన్‌ అనే ఉద్యమ నాయకురాలు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చింది. డెన్మార్క్​ రాజధాని కోపెన్ హెగన్​లో జరిగిన ఇంటర్నేషనల్ వర్కింగ్ ఉమెన్ కాన్ఫరెన్స్​లో ఈ ప్రతిపాదన చేశారు. అప్పటి నుంచి పలు దేశాల్లో మార్చి 8న ఉమెన్స్​ డేగా జరుపుకుంటున్నాం.

మహిళా దినోత్సవాన్ని రష్యా 1917లో, స్పెయిన్‌ 1936లో, చైనా 1949లో అధికారికంగా ప్రకటించాయి. ఐక్యరాజ్యసమితి కూడా మార్చి 8ని మహిళా దినోత్సవంగా ప్రకటించడంతో పశ్చిమ దేశాలన్నీ పాటించడం మొదలుపెట్టాయి.

ABOUT THE AUTHOR

...view details