- ఆత్మ పరిశీలన:చిన్న చిన్న వాదనలు జరిగినప్పుడు అహంతో ఒకరినొకరు చాలామాటలు అనేసుకుంటారు. పంతాలకోసం వాదులాటను పెంచుకంటారు. అలాకాకుండా కాసేపు ఆత్మ పరిశీలన చేసుకోండి. వాస్తవం మీ కళ్లకు అర్థమవుతుంది. సమస్య పరిష్కారానికి ఒకడుగు ముందుకు వేసే ప్రోత్సాహాన్ని అందిస్తుంది.
- వ్యక్తపరచండి:భాగస్వామి మానసిక పరిస్థితిని అంచనా వేసి తదనుగుణంగా స్పందించినప్పుడు వారి ప్రేమ మీపై రెట్టింపు అవుతుంది. అప్పుడప్పుడూ అయినా...ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు అవతలివారిలో మీకు నచ్చే సానుకూల అంశాలను ప్రస్తావించండి. ఒకటై సాగాల్సిన మీ మధ్యలో రహస్యాలకు తావివ్వకండి. నమ్మకం అనే పునాదిపైనే ఇద్దరి జీవితం ఆధారపడి ఉంటుందనే విషయం గురిం్తంచాలి.
- కలిసి కాసేపు: ఎంత తీరికలేకున్నా... రోజూ ఓ ఇరవై నిమిషాలైనా మీరు మాట్లాడ్డానికి కేటాయించుకోండి. ఈ టైమ్ ఒకరికిఒకరు అనే భావన స్థిరపడటానికి ఉపయోగపడుతుంది. అభద్రత తొలగిపోతుంది.
మీ స్వీట్హర్ట్తో సన్నిహితంగా... సంతోషంగా ఉండండిలా..! - మీ స్వీట్హర్ట్తో సన్నిహితంగా... సంతోషంగా ఉండండిలా..!
చాలామంది భార్యాభర్తల్లో ఇద్దరికీ ఒకరిపై ఒకరికి బోలెడంత ప్రేమ ఉంటుంది. కానీ దాన్ని సరిగా వ్యక్తపరచలేరు. దాంతో అపోహలు, అపార్థాలు. అలాకాకుండా ఉండాలంటే...
మీ స్వీట్హర్ట్తో సన్నిహితంగా... సంతోషంగా ఉండండిలా..!
ఇదీ చూడండి: బలగాల ఉపసంహరణ పూర్తి: చైనా