ప్రశంస:
చేసిన పనులను తగిన గుర్తింపు దక్కాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకే కుటుంబ సభ్యులందరి క్షేమం కోసం అనునిత్యం తపించే ఇల్లాలి సేవలను ప్రశంసించాలి. అలాగే ఎవరి వల్ల పొరపాట్లు జరిగినా క్షమించమని అడగడానికి అహం అడ్డురాకూడదు.
పారదర్శకత:

దంపతులు ఎలాంటి అరమరికలూ లేకుండా అన్ని విషయాలూ మాట్లాడుకోవాలి. అందులో వ్యక్తిగత అలవాట్లు, అభిరుచులు ఉండొచ్చు. ఇంటి విషయాలే కాకుండా.. ఇద్దరూ ఉద్యోగులైతే ఆఫీసుకు సంబంధించిన సమస్యలూ ఉండొచ్చు. ఒకరికి చిక్కుముడిగా అనిపించిన సమస్యకు మరొకరు క్షణాల్లో పరిష్కారం చూపించొచ్చు.
బాధ్యతలను పంచుకోవాలి:
సంసారమనే సౌధానికి దంపతులిద్దరూ రెండు స్తంభాల్లాంటి వాళ్లు. బాధ్యతలను సమానంగా పంచుకుంటేనే ఆ సౌధం ఠీవిగా నిలబడుతుంది. నిజానికి చాలా కుటుంబాల్లో బరువంతా ఒక్కరి మీదే పడుతుంది. ఒకరు ఆఫీసుకు వెళ్లి వచ్చి సోఫాలో కూర్చుని ఎంతో దీక్షగా టీవీ చూస్తుంటారు. మరొకరూ ఉద్యోగం చేసి వచ్చినా... ఇంటికి రాగానే మళ్లీ పనుల్లో మునిగిపోతారు. ఇలా ఇంటి పనుల భారమంతా ఒక్కరి మీదే పడటంతో విపరీతమైన ఒత్తిడికి గురై.. అనారోగ్యాల బారినా పడుతుంటారు.'
ఇదీ చూడండి: చేయూత ఇచ్చింది.. చేయందుకున్నాను!