తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

'ప్రేమను బహుకరిద్దాం.. కొత్తగా...' - Telangana News Updates

ప్రేమికుల రోజున మనసుకి నచ్చేవాళ్లకి ఏదో బహుమతి ఇవ్వాలనుకోవడం పరిపాటే. గులాబీ పూలు, చేతికి వాచీ, గోల్డ్‌ రింగ్‌.. బోర్‌ కొట్టేలా ఎప్పుడూ ఇవే కాకుండా.. ఇలా కొత్తవి ప్రయత్నించి చూడండి.

'ప్రేమను బహుకరిద్దాం.. కొత్తగా...'
'ప్రేమను బహుకరిద్దాం.. కొత్తగా...'

By

Published : Feb 13, 2021, 5:28 PM IST

  • హొయాకెరీ హార్ట్‌ పాటెడ్‌ ప్లాంట్‌:

మందమైన ఆకులతో అచ్చం హృదయాకారంలో ఉంటుంది. దీన్ని అందుకుంటే మీ లవ్‌ పక్కనే ఉన్నట్టు ఫీలవ్వొచ్చు.

  • పోలరైడ్‌ కెమెరా:

మీరు సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు తీసుకొని, దూరంగా ఉన్నప్పుడు అవి చూస్తూ మురిసిపోవచ్చు.

  • బాత్‌ బాంబ్స్‌:

అలసిపోయిన మీ భాగస్వామికి కాసేపు సేద తీరే అవకాశం ఇవ్వాలనుకుంటే ఇవి మంచి ఛాయిస్‌. వాడుతున్నప్పుడల్లా మీ పార్ట్‌నర్‌ తనువును స్పృశిస్తున్నట్టు భావించొచ్చు.

  • రెజిన్‌ జ్యువెల్లరీ:

సంప్రదాయ ఆభరణాలను పక్కనపెట్టి, ఈసారి ఆమెకు రెజిన్‌ జ్యువెల్లరీ బహుకరించండి. ఇందులో బోలెడు డిజైన్లు.. వీటితో అందం ఇనుమడించడం ఖాయం.

ఇదీ చూడండి: ఐ లవ్యూ అని చెప్పడం కామన్.. సో థింక్ డిఫరెంట్

ABOUT THE AUTHOR

...view details