మంచి జీవితభాగస్వామిని ఎంచుకోవడం కత్తిమీద సామే. నచ్చిన బట్టలు కొనుక్కోవడం, కోరిన ఉద్యోగం పొందడం... లాంటివాటితో పోల్చితే సరిజోడీని అన్వేషించడం చాలా కష్టమే. అయితే కొన్ని ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటే తగిన జోడీని ఎంచుకోవడం సులువవుతుంది. మీ అభిరుచికి తగ్గ వ్యక్తిని వెతికిపట్టుకోవచ్చు. మీ దాంపత్య జీవితం మరింత ఆనందమయం అవుతుంది.
సులువుగా కనెక్ట్ కావడం
సులువుగా కనెక్ట్ కావాలి
మీరు ఎంచుకున్న వ్యక్తి ఎంతటి వారైనప్పటికీ వాళ్లతో సులువుగా కనెక్ట్ కాగలరో లేదో చూడాలి. అందుబాటులో ఉంటారనుకున్న వాళ్లనే జతగాడిగా చూసుకోవాలి. మీ అభిప్రాయాలకు విలువిచ్చి, పరిగణనలోకి తీసుకున్నవాళ్లనే లెక్కలోకి తీసుకోండి. అతనితో మాట్లాడినప్పుడు బోరింగ్‌గా కాకుండా సరదాగా ఉంటూ, మీపై శ్రద్ధ తీసుకుంటున్నట్టు అనిపించాలి.
ఆసక్తులు, అభిరుచులు
ఆసక్తులు, అభిరుచులు కలవాలి
అన్నీ కాకపోయినా మీ ఇద్దరి ఆసక్తులు, అభిరుచులు కొన్నైనా మ్యాచ్ కావాలని గుర్తుంచుకోండి. అలాకాకుండా ఇవి పూర్తి విరుద్ధంగా ఉంటే మాత్రం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఆసక్తులు పెద్దగా కలవకపోతే మనసులు కూడా దగ్గరకాలేవు. తెలివితేటలు మీ భాగస్వామి తెలివితేటలూ కీలకమే. బొత్తిగా ఏ మాత్రమూ బుర్రలో గుజ్జు లేనివాళ్లను ఎంచుకోవద్దు. వీలైతే మీకంటే తెలివైనవాళ్లను ఎంచుకోండి. జీవితంలో రాణించడానికి తెలివితేటలు కీలకం. పైకి ఎదగడానికి వాటిని ఉపయోగించే నేర్పు ఉండాలి. అలాగని అద్భుతమైన ప్రతిభ ఉన్నవాళ్లే కావాలనుకోకూడదు.
స్థితిగతులు
అతని ఆర్థిక స్థితిగతులు, కుటుంబ నేపథ్యం ఈ రెండూ గమనించాలి. మీ ఇద్దరి కుటుంబాలు సరితూగేలా ఉంటే ఏ సమస్యా లేనట్టే. అలాగని కేవలం స్థితిగతులు తక్కువగా ఉన్నాయని వదులుకోవాల్సిన అవసరం లేదు. కనీసం అతనిలో పైకి రావాలన్న తపన ఉన్నా సరిపోతుంది.