Marriage Advice: జ.మీకు ఏది వద్దో తెలుసు కానీ.. ఏది కావాలో అనే విషయంలో స్పష్టత వచ్చినట్టు లేదు. మీకు నచ్చలేదు అన్న కారణంతో మీ తల్లిండ్రులకు నచ్చిన సంబంధాన్ని తిరస్కరించగలిగారు. కానీ, మీకు నచ్చాడు అన్న వ్యక్తికి మీరు నచ్చారా? లేదా? అన్న విషయం తెలియదు. అలాగే తను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సుముఖంగా ఉన్నాడా? లేదా? అన్న దాంట్లో స్పష్టత లేదు. కాబట్టి మీకు నచ్చిన వ్యక్తిని కచ్చితంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే మీ తల్లిదండ్రుల ద్వారా విచారించే ప్రయత్నం చేయచ్చేమో ఆలోచించండి. ఒకవేళ అతనికి ఇష్టం లేకపోతే మీ ఆలోచనలకు, అభిప్రాయాలకు విలువిచ్చే వ్యక్తి తారసపడతారేమో చూడండి.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
అటు ప్రయత్నాలు చేయకుండా, ఇటు మనసులో ఏవో ఆలోచనలు పెట్టుకొని వచ్చిన సంబంధాలను కాదనుకోవడం మీలోని సందిగ్ధతను సూచిస్తుంది. కాబట్టి పెళ్లి విషయంలో మీలో ఒక స్పష్టత రావాలంటే మీ ఆలోచనలకు తగ్గ వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలేంటో ఒక అవగాహనకు రండి.. అయితే కచ్చితంగా మీరు అనుకున్న వ్యక్తి మీకు దొరుకుతారని ఎవరూ చెప్పలేరు. కాబట్టి కనీసం మీ అంచనాలకు దరిదాపుల్లో ఉండే వ్యక్తిని మీరు పొందగలరేమో ప్రయత్నం చేసి చూడండి. అలాగే మీకు అవతలి వ్యక్తి గురించి కొన్ని నిర్దిష్ట ఆలోచనలు, అభిప్రాయాలు ఎలాగైతే ఉంటాయో.. ఎదుటివారికి కూడా అలాగే ఉంటాయని అర్థం చేసుకోండి. కాబట్టి మీరు వాటికి ఎంత సమీపంగా ఉంటారనేది కూడా ఆలోచించుకోండి.
ఇదీ చూడండి:'ప్రేమించి దగ్గరయ్యాడు.. పెళ్లంటే వీడియోలు బయట పెడతానంటున్నాడు..'
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!