తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

పిల్లలు పుడితే అన్నీ సర్దుకుంటాయా? - tips for happy married life

వైవాహిక జీవితంపై చాలా మందిలో అపోహలు ఉంటాయి. వాటిని అధిగమించి, వాస్తవికంగా ఆలోచించి...అనుబంధాన్ని సంతోషమయం చేసుకోవాలంటే...

one has to adjust and love one's partner in marriage
చక్కని వైవాహిక బంధానికి చిట్కాలు

By

Published : Sep 10, 2020, 12:22 PM IST

గొడవలే ఉండవు:

చక్కని వైవాహిక బంధం అసలు ఏ గొడవలూ లేకుండా సాఫీగా సాగిపోతుందని అనుకుంటారు చాలామంది. ఇది పూర్తిగా అపోహే. చిన్నచిన్న తగాదాల్లేకుండా ఏ భార్యాభర్తలూ ఉండరు. కాకపోతే ఆ గొడవలని పెంచుకోకుండా ఎక్కడ తుంచుకోవాలో తెలిసినప్పుడే బలమైన వైవాహిక బంధానికి పునాదులు పడతాయి.

పర్‌ఫెక్ట్‌ పార్టనర్‌ దొరుకుతారా?:

అమ్మాయిలు లేదా అబ్బాయిలు ఏ లోపాలు లేని మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ లేదా మిస్‌ పర్‌ఫెక్ట్‌ దొరకాలని తెగ ఆరాటపడుతుంటారు. మనలో లోపాలున్నట్టుగానే ఎదుటివ్యక్తిలోనూ ఉంటాయి. అవతలివారి కోణంలో నుంచీ ఆలోచించగలగడం, సర్దుబాట్లూ ఉన్నప్పుడే ఆ జోడీ పర్‌ఫెక్ట్‌ అవుతుంది.

పిల్లలు పుడితే...:

చాలామంది దాంపత్యంలో వచ్చే చికాకులకి సంతానమే పరిష్కారం అనుకుంటారు. నిజానికి మీ మధ్య వచ్చే చికాకులకు చిన్నారులు ఎలా పరిష్కారం చూపించగలరు? ఆ గొడవల మధ్యే పిల్లలు పెరిగి పెద్దయితే... ఆ ప్రభావం వారి మీదా పడుతుంది. ముందు మీరు సంతోషంగా ఉండండి. ఆపై పిల్లల గురించి ఆలోచించండి.

ABOUT THE AUTHOR

...view details