తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

లవ్ 'బిజినెస్'

18వ శతాబ్దం మధ్యనాటి నుంచి చేతితో రాసిన ప్రేమలేఖలకు ఇంగ్లండ్​లో ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది. 1913లో మొదటిసారి పెద్ద మొత్తంలో గ్రీటింగ్​ కార్డులను ఉత్పత్తి చేసింది కాన్సస్​లోని హాల్​మార్క్​ కార్డ్స్​ సంస్థ.

లవ్ 'బిజినెస్'

By

Published : Feb 14, 2019, 8:11 AM IST

Updated : Feb 14, 2019, 2:27 PM IST

లవ్ 'బిజినెస్'
ఫిబ్రవరి14...ప్రపంచంలోని ప్రేమికులందరికీ ఇష్టమైన రోజు. ఇప్పుడు ప్రేమికులరోజు ఓ వ్యాపారంగా మారిపోయింది. ఈ రోజు కోసం యువతీయువకుల కన్నా గిఫ్టుషాపుల వాళ్లే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ వాలంటైన్స్​ డే ఎప్పుడు వ్యాపారంగా మారింది?.

తమ ప్రేమను తెలియజేసేందుకు వారం రోజుల ముందు నుంచే లవర్స్ ఆలోచిస్తుంటారు. టెడ్డీబేర్ ఇస్తే బాగుంటుందా? ఖరీదైన గ్రీటింగ్​ కార్డు ఇద్దామా...? లేదంటే స్విస్ చాక్లెట్ల బాక్స్​ ఇస్తే ఎలా ఉంటుందో అని హైరానా పడతారు. వీటన్నింటితో లాభపడేది మాత్రం గిఫ్టు షాపుల వాళ్లు మాత్రమే.

  • 18వ శతాబ్దాపు మధ్య కాలం నుంచి ఇంగ్లండ్​లో ప్రేమికుల రోజుకు ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది. ప్రేమించిన వారికి స్వీట్​ బాక్స్​తో పాటు ప్రేమ లేఖ, ఎర్ర గులాబీలు రిబ్బన్​తో కట్టి పంపేవారు. తర్వాత కాలంలో చేతిరాత ప్రేమ లేఖల నుంచి గ్రీటింగ్ కార్డులకు మళ్లారు.
  • 1913లో కాన్సాస్​ పట్టణంలోని హాల్​మార్క్​ కార్డ్స్​ అనే సంస్థ పెద్ద మొత్తంలో ప్రేమికుల దినోత్సవ గ్రీటింగ్​ కార్డులను ఉత్పత్తి చేసింది. రోజులు మారుతున్న కొద్ది ప్రేమ రూపు రేఖలు మారిపోయాయి. పక్కా బిజినెస్​ అయిపోయింది.

గ్రీటింగ్​ కార్డుల నుంచి గోల్డ్​ రింగ్​ల వరకు వచ్చింది. తమకు నచ్చినవారికి ఎంత ఖరీదైన బహుమతి ఇస్తే అంత ప్రేముంటుందనే భ్రమనే వ్యాపారులకు వరంగా మారింది. ఒకరు ఖరీదైన వాచ్​ ఇస్తే మరొకరు బ్రాండెడ్​ డ్రెస్​, ఇంకొకరు గోల్డ్​ రింగ్​ ఇలా కాస్ట్​లీ గిఫ్ట్​లు కొనడం ప్రారంభమైంది. అందుకే షాపుల వాళ్లు వాలంటైన్ డే స్పెషల్ డిస్కౌంట్లు అంటూ ప్రేమికులను ఊరిస్తున్నారు.

Last Updated : Feb 14, 2019, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details