అతను భార్య చనిపోయి మానసికంగా కుంగి పోయినా, ఆమెతో గడిపిన క్షణాలు గుర్తున్నా... మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నాడు. మీకే కష్టమూ కలిగించడం లేదు. మీరూ ఇష్టంగానే ఉంటున్నారు. అతడు దురదృష్టవశాత్తూ భార్య చనిపోవడం వల్ల మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారని గుర్తుంచుకోండి. మొదటి భార్యతో ఆనందంగా ఉండే వాడు లాంటి తలపులతో మనసు పాడు చేసుకోవద్దు. మీరిలాగే ఉంటే కొన్నాళ్లయ్యాక అతను మానసికంగా దూరమయ్యే అవకాశముంది. తెలిసే చేసుకున్నారు.. ఇప్పుడు ఆలోచించాల్సింది గతం గురించి కాదు.
'ఆయన మొదటి భార్య గుర్తొస్తే.. పాపకు దగ్గరకాలేకపోతున్నా'
మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. నన్ను రెండో పెళ్లివాడికిచ్చి చేశారు. ఆయనకు నాలుగేళ్ల పాప ఉంది. నన్ను ప్రేమగానే చూసుకుంటారు. నాకూ ఆయనంటే ఇష్టమేగానీ పాపకు దగ్గర కాలేకపోతున్నాను. తను మాత్రం ‘అమ్మా’ అంటూ నా చుట్టూ తిరుగుతుంది. ఆయన నాతో చనువుగా ఉన్నట్టే... మొదటి భార్యతోనూ ఉండబట్టే ఈ పాప పుట్టిందనే ఆలోచనను భరించలేకపోతున్నాను. నాలో మార్పు వచ్చి పసిదానికి తల్లిలేని లోటు తీర్చాలంటే ఏంచేయాలి? - ఓ సోదరి, వరంగల్
Wife's dilemma
కల్లాకపటం తెలియని ఆ పసిదానికి ప్రేమ, ఆదరణ కావాలి. మనం ప్రేమగా చూస్తే వాళ్లూ అంతే ఇష్టంగా ఉంటారు. మీరు లేనిపోని ఆలోచనలతో దూరం పెట్టడం వల్ల ఆ చిన్నారి బాధ పడొచ్చు. మున్ముందు మీకూ సమస్యలు వస్తాయి. పెద్దయ్యాక మొండిగా ఉండటం, దురుసుగా ప్రవర్తించడం, మిమ్మల్ని పట్టించుకోక పోవడం వంటివి జరుగుతాయి. ఏదేమైనా ఆ అమ్మాయిని సొంత కూతురిగానే చూసుకోవాలి. ఇదే విషయమై మీ భర్తకు మీ మీద మరింత ప్రేమ పెరుగుతుంది. లేనిపోని ఆలోచనలు మానేసి ప్రస్తుత జీవితాన్ని ఆనందించండి.