* తాము అనుకున్నది జరగకపోవడం, ఇతరులతో పోల్చుకోవడం, ఒత్తిడి వంటివెన్నో కారణాలు. ఇలా తరచూ జరుగుతుంటే వారిని నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకో తెలుసుకునే ప్రయత్నం చేయండి. వారితో కూలంకషంగా, ఆత్మీయంగా చర్చించండి. పరిష్కారాలు చూపించండి. చిన్న పిల్లలు వారికేం సమస్యలుంటాయని అనుకోవద్దు. పిల్లల స్థాయిలో తగాదాలు కావొచ్చు. ఇష్టం లేని పనులు చేయాల్సి రావొచ్చు. ఇవన్నీ వారి మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయి. అమ్మగా వారిని అక్కున చేర్చుకోండి. మనసువిప్పి మాట్లాడితే అన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది.
* పిల్లలు అతిగా కోప్పడానికి అతి గారాబం చేయడం, సామాజిక చొరవ తక్కువగా ఉండటం వంటివి కారణం అవుతాయి. అందుకే చిన్నారులకు క్రమశిక్షణ అలవాటు చేయాలి. స్పందించే తీరూ సానుకూలంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఎదుటివారితో మాట్లాడే తీరు, స్పందించడం వంటి నేర్పించండి.
* పిల్లల్లో కోపానికి మానసిక, ఆరోగ్య సమస్యలూ మూలం కావచ్చు. తమని తాము తక్కువగా ఊహించుకోవడం, ఊబకాయం వంటివీ ఉంటాయి. అందుకే ఆత్మవిశ్వాసానికి మించిన బలమేదీ లేదని చెప్పండి. కచ్చితంగా రోజులో కనీసం అరగంట పాటు శారీరక వ్యాయామం అందేలా చూడండి. బ్రెయిన్ పజిల్స్ చేయడం, డ్రాయింగ్, డ్యాన్స్, మ్యూజిక్ వంటివి నేర్పించడం వల్ల వారిలో కోపం తగ్గుతుంది.
మీ పిల్లలకి కోపం వస్తుందా? - కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి
కోపం వస్తే అలిగి మౌనంగా కూర్చునే పిల్లలే కాదు ఆ ఉద్వేగాలను బయటికి వ్యక్తం చేస్తూ అవీ ఇవీ పగలకొట్టడం, తలకొట్టుకోవడం వంటివి చేసేవారూ ఉంటారు. ఇలాంటివారి కోపాన్ని ఎలా నియంత్రించాలంటే...
పిల్లలకి కోపం వస్తుందా?
ఇదీ చూడండి:'యువతరం ఓటు విద్యుత్ వాహనాలకే'