Extra Marital Affair : మా మొదటి మూడు సంవత్సరాల కాపురంలో నా భర్త ఏనాడూ నాతో సరిగ్గా ఉండలేదు. అలాంటిది నా భర్త బయటి ఆడవాళ్లతో ఎంజాయ్ చేస్తుంటే అతనితో సాధారణ జీవితాన్ని ఎలా గడపాలో అర్థం కావడం లేదు. ఒకసారి నా భర్త వేరే మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఆడియో నేను విన్నాను. నేను జాబ్‌కు వెళ్తుండడంతో పాప ఒక్కర్తే ఉండాల్సి వస్తోంది. దాంతో ఒంటరిగా ఫీలవుతోంది. నేను ఇంకో బేబీని ప్లాన్ చేసుకోవాలా? ఇప్పటికే 10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. మళ్లీ పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటే ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది? నన్ను నేను ఎలా మార్చుకోవాలి? కనీసం నా భర్తను చూస్తే నాకు దగ్గరకు తీసుకోవాలనే ఫీలింగ్ కూడా కలగడం లేదు. నా ఆలోచనలు, తప్పు వల్ల నా పాప బాధపడకూడదు. ఈ సమస్యలతో విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాను. నాకు చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు. దయచేసి సలహా ఇవ్వగలరు.
జ: మీ భర్త చేసిన తప్పుల వల్ల మీకు వైరాగ్య భావం కలిగిందని స్పష్టమవుతోంది. అతను తప్పు చేసి అది మీరు చేస్తున్నట్టుగా చిత్రీకరించి.. తిరిగి అదే తప్పును తను చేస్తున్నాడు. అది చెల్లుబాటు చేసుకునే ప్రయత్నం కూడా చేసుకుంటున్నాడు. ప్రస్తుతం తాను చేస్తోన్న పనులు అతనికి ఆరోగ్య పరంగానూ మంచివి కాదు. అలాగే అతను తనను తాను మోసం చేసుకుంటూ మిమ్మల్ని కూడా మోసం చేస్తున్నాడని స్పష్టమవుతోంది. నిజంగా మీ ఇద్దరి మధ్య సత్సంబంధాలు నెలకొనాలంటే.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా మీ బంధం దృఢపరచుకోవడానికి ఇద్దరూ కలిసి కౌన్సెలింగ్‌కి వెళ్లాల్సి ఉంటుంది.