సాధారణంగా ఒకసారి ఒక వ్యక్తికి మనసిచ్చి వారినే ఆరాధిస్తుంటారు మహిళలు. అయితే OLD బారిన పడే వారిలోనూ పురుషుల కంటే మహిళలే ఎక్కువని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల ప్రేమ బంధంలో కలిగే ప్రయోజనాల కంటే ఈ డిజార్డర్‌తో బాధపడుతోన్న వారిలో మానసిక సమస్యలే ఎక్కువని, దాన్ని కొన్ని సాధారణ లక్షణాల ద్వారా గుర్తించచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఈ లక్షణాలుంటే..!
* మీతో ప్రేమలో ఉన్నారని భావించే వ్యక్తి పట్ల విపరీతమైన ఆకర్షణకు గురవడం.
* నిరంతరం ఆ వ్యక్తికి సంబంధించిన ఆలోచనలే మనసులోకి రావడం.
* మూడో వ్యక్తి దృష్టి కూడా వారిపై పడకూడదన్నంత అతి జాగ్రత్త తీసుకోవడం.
* ఆ వ్యక్తి తనకే సొంతం అన్నట్లుగా ఆలోచించడం, చేతల్లోనూ ఇలాగే ప్రవర్తించడం.
* మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మరెవరితోనూ మాట్లాడకూడదనుకోవడం.. ఒకవేళ మాట్లాడితే విపరీతంగా అసూయపడడం..
* ఆత్మ గౌరవం తగ్గిపోవడం.. అంటే నిరంతరం ఎదుటి వ్యక్తి ఆలోచనల్లో పడిపోయి మిమ్మల్ని మీరు పట్టించుకోకపోవడం.
* ఇతరులతో కలవలేకపోవడం..
* మీరు ఇష్టపడే వ్యక్తి మీ దగ్గర లేకపోయినా వారికి పదే పదే ఫోన్ చేయడం, సందేశాలు పంపడం.. ఇలా నిరంతరం వారితో టచ్‌లో ఉండడం..
* వారి రోజువారీ పనుల్ని, కదలికల్ని క్షుణ్ణంగా పరిశీలించడమే పనిగా పెట్టుకోవడం.
* వారు చేసే పనుల్ని తమ అధీనంలో ఉంచుకోవాలనుకోవడం.. మొదలైనవి
కీడెంచి మేలెంచాలి!
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం.. దాన్ని ఎదుటివారిపై మీరు చూపించే అపార ప్రేమ అని అనుకోకుండా.. మానసిక సమస్యగా పరిగణించి నిపుణుల్ని సంప్రదించడం మంచిదట! ఈ క్రమంలో వారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలడగచ్చు. మీలోని లక్షణాలు, మీ రిలేషన్‌షిప్, ఇదివరకే మీ కుటుంబంలో ఎవరికైనా ఇలాంటి మానసిక సమస్య ఉందా?.. వంటి విషయాల గురించి వారు మీకు ప్రశ్నలు వేసి దాని ద్వారా మీకు OLD ఉందా? లేదా? అనేది నిర్ణయిస్తారు. అలాగే దీని వల్ల మరే ఇతర మానసిక సమస్యనైనా ఎదుర్కొంటున్నారా అనే విషయం కూడా పసిగడతారు. ఇక మీ సమస్యను బట్టి మానసిక ప్రశాంతతను చేకూర్చే మందులు సూచిస్తారు. అలాగే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, టాక్ థెరపీ వంటి చికిత్సల ద్వారా ఈ మానసిక సమస్యను దూరం చేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఇలా వైద్యులు సూచించిన మందులు వాడే క్రమంలో కొంతమందిలో తలనొప్పి, వికారం, బరువు పెరగడం, అలసట, నిద్రలేమి.. వంటి లక్షణాలు కనిపించచ్చట! అలాంటప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణుల్ని సంప్రదించి తగిన సలహా తీసుకోవాలన్న విషయం మర్చిపోవద్దు.
వదిలించుకోకపోతే అనర్థమే!
ఇలా ఎదుటి వ్యక్తిపై మీరు కురిపించే అతి ప్రేమ మీ జీవనశైలిపై, రోజువారీ పనులపై కూడా ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఒకవేళ ఆ వ్యక్తి మిమ్మల్ని కాదని మీతో విడిపోయినా.. దాన్ని మీరు అంగీకరించలేనంత బాధలోకి కూరుకుపోతారు. తద్వారా మీరు మానసికంగా మరింత కుంగిపోయే అవకాశం ఉంది.. కాబట్టి ఈ సమస్యను దూరం చేసుకోవడానికి వైద్యులు సూచించిన మందులు, థెరపీలతో పాటు జీవనశైలిలోనూ పలు మార్పులు-చేర్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..!