తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

మీ ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గించుకోండి.. ఇవిగో చిట్కాలు! - couple healthy trelationship tips

క్షణం తీరికలేని పనివేళలు, మారిన జీవనశైలి భార్యాభర్తలు కలిసి గడిపే సమయాన్ని తగ్గించేశాయి. దాంతో క్రమంగా జీవితాలు యాంత్రికంగా మారిపోయాయి. క్రమంగా ఒకరికొకరు దూరమవుతున్నారు. అలాంటి పరిస్థితిని అధిగమించడానికి ఈ చిట్కాలు పనిచేస్తాయి...

healthy trelationship tips
healthy trelationship tips

By

Published : Sep 1, 2020, 7:13 AM IST

  • మీరు ఉద్యోగం చేస్తున్నా, ఇంట్లోనే ఉంటున్నా...కుటుంబ సభ్యులందరూ కలసి కూర్చున్నప్పుడు ఫోను జోలికిపోవద్ధు ముఖ్యంగా ఆలుమగలుగా మీ కోసం కేటాయించుకునే సమయంలో ఫోనులు మాట్లాడటం, వీడియోలు చూస్తూ గడిపేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెట్టడం చేయొద్ధు ఇవి మీ మధ్య దూరాన్ని పెంచేస్తాయి. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌...ఏదైనా సరే! చూడటానికి ఓ సమయం పెట్టుకోండి. అవసరమో, వినోదమో దానికీ పరిమితి ఉంటుంది. మీకు ఒకరితో ఒకరు గడిపే సమయం ఉంటుంది.
  • రోజూ మీకోసం మీరు కేటాయించుకునే సమయం ఎంత? అని అడిగితే ‘అబ్బే దానికంటూ ప్రత్యేకంగా ఎందుకులే? ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా!’ అంటారు చాలామంది. అది నిజమే కానీ జీవితం యాంత్రికంగానే సాగుతుంది. అలాకాకుండా ఒకరికోసం మరొకరు సమయాన్ని వెచ్చించగలగాలి. మనసు విప్పి మాట్లాడుకోవాలి. అందుకోసం మీరే సమయాన్ని సృష్టించుకోవాలి. కలిసి కాఫీ తాగండి. ఓ మంచి పుస్తకం కోసం చర్చించుకోండి. ఇవన్నీ మీ అభిరుచులకు బలం చేకూరుస్తాయి. మీ మధ్య దూరాన్ని తగ్గిస్తాయి.
  • ఏ చేసినా ఎవరికి వారుగా కాకుండా కలిసి చేయండి. ఇద్దరికీ ఏ కాస్త సమయం చిక్కినా కలిసి నడవండి. ఉదాహరణకు టీవీనే చూడాల్సి వచ్చినా... ఓ మంచి సినిమానో, కార్యక్రమమో... ఏకాభిప్రాయానికి వచ్చి సరదాగా ఆ సమయాన్ని గడిపేయండి. వారంలో ఓ రోజు ఇద్దరూ కలిసి నచ్చిన వంటకాల్ని ప్రయత్నించండి. ఇంటి పనులనీ కలిసి చేస్తూ ఉంటే ఇవన్నీ మీలో కొత్త ఉత్సాహాన్నిస్తాయి.

ABOUT THE AUTHOR

...view details