తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

లోపాన్ని దాచిపెట్టి... పరువుకోసమే పెళ్లి.. - తెలంగాణ వార్తలు

మా పెళ్లయి రెండేళ్లవుతోంది. ఇప్పటివరకూ అతడు నాతో సంసారం చేయలేదు. గట్టిగా నిలదీస్తే... పరువు కోసమే పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. ఇంట్లో వాళ్లతో చెప్పాలని ప్రయత్నిస్తే... నీకే మరొకరితో అక్రమ సంబంధం ఉందని చెబుతా అని బెదిరించాడు. నేను ఆలోచనల్లో ఉండగానే ఉద్యోగం పేరుతో విదేశాలకు వెళ్లిపోయాడు. అత్తమామలు నన్ను కుటుంబ సభ్యురాలిగా ఏ రోజూ చూడలేదు. వేధించి ఇంట్లో నుంచి గెంటేశారు. ఇప్పుడు అతడిని రప్పించాలన్నా, నాకు న్యాయం జరగాలన్నా ఏం చేయొచ్చని ఓ బాధితురాలు ప్రముఖ న్యాయవాది జి. వరలక్ష్మి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యకు న్యాయపరంగా ఉన్న అవకాశాలు... ఇలాంటి ఇబ్బందులున్న మహిళలు చేయాల్సిన అంశాలపై న్యాయవాది వరలక్ష్మి సూటిగా వివరించారు.

getting-married-for-the-sake-of-dignity
లోపాన్ని దాచిపెట్టి... పరువుకోసమే పెళ్లి..

By

Published : May 5, 2021, 10:30 AM IST

అతడికి ఉన్న లోపాన్ని దాచిపెట్టి పెళ్లి చేశారని, అందుకే ఆ పెళ్లి చెల్లదని మీరు హిందూ వివాహచట్టంలోని సెక్షన్ 121(ఎ) ప్రకారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చు. సలిటీ కింద సాధారణంగా పెళ్లయిన సంవత్సరం లోపు లేదా నిజం తెలిసిన సంవత్సరంలోపు దావా వేయాలి. కానీ ప్రస్తుతం అలా కోరుకోవడం వల్ల మీకు వచ్చే లాభమేమీ లేదు. ముందు మీ అత్తింటివారి పై గృహహింస చట్టాన్ని ఉపయోగించి కేసు వేయండి. కోర్టు నోటీసు లేదా నాన్ బెయిలబుల్ అరెస్ట్ ఉంటే మీ భర్తని విదేశాల నుంచి రప్పించడానికి ప్రయత్నించొచ్చు.

మీరు అతనితో పాటు అతని బంధువుల మీద క్రిమినల్ ఫిర్యాదు ఫైల్ చేయండి. (సెక్షన్ 1563) సీఆర్పీసీ ప్రకారం మీరు ఫైల్ చేసిన ఫిర్యాదు మీద మెజిస్ట్రేట్ కాగ్నిజెన్స్ తీసుకుని అతనిమీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే... దాన్ని పాస్​పోర్ట్ ఆథారిటీ వాళ్లకు పంపించొచ్చు. అతని పాస్​పోర్టును రద్దు చేయమని కోరవచ్చు. పాస్​పోర్డు చట్టంలోని సెక్షన్ పది ప్రకారం ఎవరైనా వ్యక్తి మీద నాన్​ బెయిలబుల్ వారెంట్, నేర నిరూపణ అయితే కనుక కన్విక్షన్ ఆర్డరు. కోర్టు సమన్లు వంటివేవైనా జత చేసి పాస్​పోర్డు రద్దు చేయమని అడగొచ్చు. అవే కారణంగా చూపించి వీసానూ క్యాన్సిల్ చేయించమని దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఎంబసీనీ సంప్రదించొచ్చు. ఈ సమస్యను జాతీయ మహిళా కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లొచ్చు. వీరు ఎన్ఆరై పెళ్లి బాధితుల కోసం ఓ సెల్​ని ఏర్పాటు చేశారు. మీ ఫిర్యాదు కాపీ ఆధారంగా వారు సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపిస్తారు. మంచి లాయర్ను సంప్రదిస్తే సమస్య నుంచి త్వరగా బయటపడగలరు.

ఇదీ చూడండి:ప్రైవేటు ఆస్పత్రుల దౌర్జన్యం... లక్షల్లో వసూలు

ABOUT THE AUTHOR

...view details