తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

Hug Day Special Story: ఏ కౌగిలింతలో ఏం అర్థముందో తెలుసా? - lovers day

బాధైనా, సంతోషమైనా బిగి కౌగిలింతతో ఎదుటి వారితో పంచుకోవడం మనకు అలవాటే! తద్వారా మనసులోని భావోద్వేగాలు అదుపులోకొస్తాయని చెబుతున్నారు నిపుణులు. నిజంగానే కౌగిలింతకు అంత పవర్‌ ఉంది మరి! మనిషి మూడ్‌ని మార్చేసే శక్తి హగ్‌లో ఉందని ఇప్పటికే పరిశోధకులు Hug Day Special Story: శాస్త్రీయంగా నిరూపించారు కూడా! వేలంటైన్స్‌ వీక్‌లో భాగంగా ఫిబ్రవరి 12ను ‘హగ్‌ డే’గా జరుపుకోవడం మనకు తెలిసిందే. ఈ ప్రత్యేకమైన రోజున తమకు నచ్చిన వ్యక్తులను ఆప్యాయంగా కౌగిలించుకొని తమ ప్రేమను వ్యక్తం చేస్తారు ప్రేమపక్షులు. మరి, ఆప్యాయంగా ఇచ్చే ఈ కౌగిలింతలో ఎన్నో రకాలు, వాటికి మరెన్నో అర్థాలున్నాయన్న విషయం మీకు తెలుసా? ఏ హగ్‌కు ఏ అర్థముందో నిపుణుల మాటల్లోనే తెలుసుకుందాం రండి..

Hug Day Special Story
Hug Day Special Story

By

Published : Feb 12, 2022, 4:14 PM IST

Hug Day Special Story:

వెనక నుంచి హత్తుకుంటే..

ఒక వ్యక్తి మిమ్మల్ని వెనక నుంచి హత్తుకున్నారంటే మీ రక్షణ గురించి వాళ్లు ఎంతో నిబద్ధతతో ఉన్నారని అర్థం. సహజంగా కేవలం ప్రేమికులు లేదా భార్యభర్తల్లోనే ఇలాంటి కౌగిలింతలు కనిపిస్తుంటాయి. ఒకవేళ మాటల్లో చెప్పలేకపోతున్నా ఓ వ్యక్తి మిమ్మల్ని వెనకాల నుంచి గట్టిగా కౌగిలించుకున్నారంటే వారికి మీపై ఎంతో ప్రేమ, నమ్మకం ఉన్నాయని అర్థమట!

Valentine's Week 2022

బిగి కౌగిలింత

ఒక వ్యక్తిని ఎన్నో రోజుల తర్వాత కలుసుకోవడమో లేక వారిని విడిపోవడానికి ఇష్టపడనప్పుడో గట్టిగా కౌగిలించుకోవడం మనకు తెలిసిందే. దీనినే ‘బేర్‌ హగ్‌’గా పిలుస్తారు. ఒక వ్యక్తి మిమ్మల్ని ఇలా హగ్‌ చేసుకుంటే వారికి మీపై ఎంతో ప్రేమ ఉందని అర్థం. ఇది కేవలం ప్రేమికులు, భార్యాభర్తలు, తల్లీపిల్లల మధ్యే కాకుండా.. స్నేహితులు, బంధువుల మధ్య కూడా ఉంటుంది. ‘నిన్ను విడిచి నేను ఉండలేను.. నీకు దూరం కాలేను’ అని చెప్పడానికి కూడా ఇలా కౌగిలించుకుంటారట.

వీపు నిమరడం..

కౌగిలించుకున్న తర్వాత వీపుపై నిమరడం మనలో చాలామందికి అనుభవమే. ఇలా హగ్‌ చేసుకుంటున్నారంటే వారు మీ సంరక్షకులని అర్థం. సహజంగా తల్లిదండ్రులు లేదా పెద్దవాళ్లు చిన్నారులను ప్రోత్సహిస్తున్న సమయంలో, వారిని ఓదార్చుతున్న సమయంలో ఇలాంటి కౌగిలింతలు సర్వసాధారణమే.

మర్యాదగా..

మోముపై సంతోషం, చిరునవ్వుతో ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడాన్ని ‘పొలైట్‌ హగ్‌’గా పిలుస్తారు. ఇలాంటి కౌగిలింతలు సాధారణంగా స్నేహితులు, పేరెంట్స్‌-చిన్నారులకు మధ్య కనిపిస్తుంటాయి. ఇలా ఎవరైనా మిమ్మల్ని కౌగిలించుకుంటే ‘నీకు నేనున్నాననే భరోసా ఇస్తున్నట్లు’ అర్థం.

కళ్లతో కౌగిలింత

ఒక వ్యక్తి మీ కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ కౌగిలించుకుంటున్నారంటే అతనికి/ఆమెకు మీపై పిచ్చి ప్రేమ ఉందని అర్థం. మీతో పీకల్లోతు ప్రేమలో ఉంటేనే ఇలాంటి హగ్‌ ఇస్తారు. శరీరాలు పెనవేసుకుంటూ, కళ్లతో మాట్లాడుకుంటూ ఇచ్చుకునే ఈ హగ్‌.. ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని తెలుపుతుంది.

శరీరాలు పెనవేసుకోకుండా..

శరీరాలు పెనవేసుకోకుండా కేవలం ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేస్తూ ఆలింగనం చేసుకోవడాన్ని ‘లండన్‌ బ్రిడ్జ్‌ హగ్‌’గా పేర్కొంటారు. ఇలా కౌగిలించుకునే వారి మధ్య స్వచ్ఛమైన స్నేహబంధం తప్ప మరే బంధం ఉండదని చెబుతున్నారు నిపుణులు.

నడుముపై చేతులేసి..

నడుముపై చేతులు వేసి కౌగిలించుకునే వారితో జాగ్రత్తగా ఉండాలట. ప్రేమించాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్న వారు ఇలా హగ్‌ చేసుకుంటారని రిలేషన్‌షిప్‌ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారు ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతారట!

ఇదీ చూడండి: కొత్తగా పెళ్లయిందా? బీమా, లోన్ విషయంలో ఇలా చేస్తే లాభాలెన్నో!

ABOUT THE AUTHOR

...view details