అసూయ వెనకున్న అసలు కారణాలను అన్వేషించడానికి ప్రయత్నించాలి. మీలోని అభద్రతా భావమే చాలావరకు ఇందుకు కారణమవుతుంది గతంలో జరిగిన దుర్ఘటనలు, బాల్యంలో అనుభవించిన బాధలు అభద్రతకు కారణమైతే, వాటిని గుర్తించి బయటకు రావాలి.
- ఎదుటి వారిలో మిమ్మల్ని మీరు పోల్చుకో వడం వల్ల అసంతృప్తే మిగులుతుంది. అది కాస్తా వారిమీద అసూయగా మారుతుంది. ఈ పోలికను ఆపేయండి.
- ఆభద్రతాభావంతో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటే అసూయ దరిదాపులకు రాదు.
- అసూయతో రగిలిపోతున్న విషయాన్ని ఎదుటివాళ్లు గమనించే ఉంటారు. మీరు పడుతున్న ఇబ్బందిని గురించి నిజాయతీగా వాళ్లతోనే మాట్లాడవచ్చు. ఈ సమస్య నుంచి బయటపడటానికి వారి సాయం తీసుకోవచ్చు.