తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

చిన్నారులకు నర్సరీ క్లాసులు లాభమే..! - తెలంగాణ వార్తలు

పిల్లల్ని చిన్న వయసులో స్కూలుకి పంపించడం ఎందుకని అనుకుంటున్నారా! అయితే మీరు ఇది చదవాల్సిందే. ప్రీ స్కూళ్లకు వెళ్లిన పిల్లలకు భావోద్వేగాలకు, సామాజిక సంబంధాలకు సంబంధించిన మంచి ప్రవర్తన ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. వాళ్లలో సహకరించుకునే గుణం ఎక్కువగా ఉంటుందని వాళ్ల పరిశీలనలో స్పష్టమైంది.

children-benefits-of-preschool-education explained by penn state university
నర్సరీ క్లాసులు లాభమే!

By

Published : Dec 27, 2020, 12:28 PM IST

రెండున్నరేళ్లు రాగానే పిల్లల్ని నర్సరీ క్లాసులకి పంపించడం తెలిసిందే. అయితే అంత చిన్నవయసులో వాళ్లను స్కూలుకి పంపడం ఎందుకని తల్లిదండ్రులు అనుకోవచ్చు. కానీ అది మంచిదేననీ దానివల్ల భవిష్యత్తులో వాళ్లలో భావోద్వేగాలకూ సామాజిక సంబంధాలకూ సంబంధించిన ప్రవర్తన మరింత మెరుగవుతుందనీ అంటున్నారు పెన్‌ స్టేట్‌ యూనివర్సిటీ నిపుణులు. ప్రీ స్కూల్‌కి వెళ్లిన పిల్లలకి ఎలిమెంటరీ, మిడిల్‌, హైస్కూలు స్థాయిలో భావోద్వేగ పరమైన సమస్యలు తక్కువగా ఉంటున్నాయని వాళ్ల పరిశీలనలో తేలిందట. అంతేకాదు, వాళ్లలో సహకరించుకునే గుణం ఎక్కువగా ఉంటుందని వాళ్ల పరిశీలనలో స్పష్టమైంది.

ఇందుకోసం వీళ్లు ప్రీస్కూల్లో చదివిన కొందరు పిల్లల్ని ఎంపికచేసి, వాళ్లను పదో తరగతి వరకూ గమనిస్తూ వచ్చారట. తరవాతి కాలంలో వాళ్లు ఏ స్కూల్లో చదివినా నర్సరీ కాస్లులకు వెళ్లని పిల్లలకన్నా చురుకుగానూ మెరుగ్గానూ ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా ప్రీస్కూల్లో వాళ్లు తోటి పిల్లలతో కలిసి కథలు వినడం, వాటి గురించి మాట్లాడుకోవడం, రైమ్స్‌ను వల్లె వేయడం... వంటి వాటి వల్ల త్వరగా అందరితో కలిసిపోయేతత్త్వం పెరుగుతుందనీ భాషాపరమైన నైపుణ్యాలూ మెరుగ్గా ఉంటాయనీ చెబుతున్నారు.

ఇదీ చదవండి:2020: అదరగొట్టిన 'బుట్టబొమ్మ'.. టాప్ సెర్చ్​లో ఆ సినిమా

ABOUT THE AUTHOR

...view details