మాది పేద కుటుంబం(POOR FAMILY). కట్నం(DOWRY) లేకుండా పెళ్లి చేసుకున్నారు. నా మీద పెత్తనం చేయాలనుకునే ఆడపడుచులు, అత్తలతో(Domestic violence) కొద్దిరోజులకే గొడవలు మొదలయ్యాయి. దాంతో నాకూ మావారికీ మధ్య దూరం పెరిగింది. నేను పుట్టింటికి వచ్చేశా. తర్వాత ఆయన ఆత్మహత్య(HUSBAND SUICIDE) చేసుకున్నారు. ఇక నేనెప్పుడూ అత్తింటికి వెళ్లలేదు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నా. ఇటీవల మా అమ్మా నాన్నా చనిపోయారు. నాకే ఆధారమూ లేదు. నా భర్త పేరు మీద మూడెకరాల పొలం ఉంది. అది నాకు వస్తుందా? నేను కోర్టులో కేసు వేయొచ్చా? - ఓ సోదరి
మీ భర్త ఆత్మహత్యకు మీరు కారణం అని ఎక్కడైనా నిరూపణ అయ్యిందా? అంటే మీ మీద కేసు పెట్టడం లాంటివేమైనా జరిగాయా? హిందూ వివాహచట్టం-1956లోని సెక్షన్ 10 ప్రకారం చనిపోయిన వ్యక్తి పేరు మీద ఉన్న ఆస్తి... భార్య, అతని పిల్లలు, తల్లికి సమాన భాగాలుగా వస్తాయి. అయితే ముందు మీరు చట్టబద్ధ వారసురాలిగా నిరూపించుకోవాలి. అందుకు మీరు కుటుంబ వారసత్వ ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేసుకోవాలి. లేదా కోర్టు ద్వారా ఆ ధ్రువపత్రం పొందడానికి ఒరిజినల్ పిటిషన్ సిటీ సివిల్ కోర్టు పరిధిలో దాఖలు చేసుకోవాలి. మీ దగ్గరున్న పెళ్లి ఆధారాలు కోర్టుకు సమర్పించి వారసురాలిగా నిరూపించుకోవాలి. విడాకులు తీసుకోలేదని, మీ భర్త చావుకి మీరు కారణం కాదని నిరూపించాలి.