నచ్చిన వ్యక్తి జీవితాంతం వారి నియంత్రణలో ఉండాలని కోరుకుంటారు కొందరు. ఇది సరికాదు. ఇష్టమైన వ్యక్తి కోసం కొన్ని సందర్భాల్లో మనమూ సర్దుకుపోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఏ సందర్భాల్లో సర్దుకుపోవాలి? ఎప్పుడు కాదో చూడండి.
*ఆలుమగలు కలిసిమెలిసి సంతోషంగా ఉన్నప్పుడే అది అందమైన బంధమవుతుంది. ఏ ఒక్కరు ఆనందంగా లేకపోయినా ఆ బంధానికి అర్థముండదు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మీకు నచ్చకపోయినా, భాగస్వామి మాటకు విలువ ఇవ్వాలి. అయితే ఇదే పునరావృతమైతే మాత్రం మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వారవుతారు. సర్దుకుపోవడం అనేది మీ ఇద్దరి మధ్య అనుబంధాన్ని పెంచేదిగా ఉండేలా తప్ప ఎదుటివారి ఆలోచనలను అణచి వేసేలా ఉండకూడదు.
*ఒక్కోసారి కొన్ని కొన్ని విషయాల్లో ఇద్దరికీ విభేదాలు రావొచ్చు. అంతమాత్రాన ఎదుటి వారిపై కోపం, నిర్లక్ష్యం లాంటివి ప్రదర్శించవద్దు. ‘నేనే కరెక్ట్... నువ్వే తప్పు’ అంటూ దెబ్బలాటకు దిగొద్దు.