ప్రసారిత పాదోత్తాసనం:రెండుకాళ్లను ఎంత వీలైతే అంత దూరంగా పెట్టి నిలబడాలి. జాగ్రత్తగా ముందుకు వంగి రెండు చేతులను రెండు పాదాల మధ్యన పెట్టాలి. ఇప్పుడు రెండు మోచేతులను, తలపైభాన్ని నేలకు ఆనించి ఎంత సేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి. తర్వాత చేతులను మెల్లగా చాపి యథాస్థితికి రావాలి. ఈ ఆసనం వల్ల వెంట్రుకల కుదుళ్లకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
జుట్టు రాలిపోతుందా... అయితే ఈ ఆసనాలు వేయండి! - hair fall tips
జుట్టు రాలిపోకుండా ఉండటానికీ, చుండ్రు నివారణకు ఈ ఆసనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. పోషకాహారం తీసుకుంటూ వీటిని చేయడం వల్ల ఫలితం ఉంటుంది.
yoga
పృథ్వీముద్ర:సుఖాసనంలో కూర్చుని చేతులను మోకాళ్ల మీద పెట్టుకోవాలి. బొటనవేలికి ఉంగరం వేలు చివరను తాకించాలి. రెండు చేతులతోనూ ఇలాగే చేయాలి. కళ్లు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది.