ఉరుకుల, పరుగుల జీవితంలోని ఒత్తిడిని జయించి ఆనందంగా, ఆరోగ్యంగా జీవించేందుకు చాలామంది యోగాను మార్గంగా ఎంచుకుంటారు. ధ్యానం చేస్తూ, ఆసనాలు వేస్తూ సాంత్వన పొందుతుంటారు. అయితే ఆసనాలు వేయాలని ఎంత కోరిగ్గా ఉన్నా.. కొందరికి శరీరం అంతగా సహకరించదు. అధిక బరువు, మోకాళ్ల నొప్పులతో ఇబ్బందిపడేవాళ్లు నేల మీద వజ్రాసనం లేదా పద్మాసనంలో కూర్చోలేరు. అలాంటివారి సమస్యలను దూరం చేయడానికి రూపొందించినవే ఈ ప్రత్యేకమైన సాధనాలు. వీటి సాయంతో సులువుగా ఆసనాలను వేయొచ్చు.
యోగాకు శరీరం సహకరించట్లేదా..! వీటితో సులువుగా చేసేయండి! - యోగా పరికరాలు
ఒత్తిడిని జయించడానికి యోగా ఉత్తమమైన మార్గం. ధ్యానం చేస్తూ, ఆసనాలు వేస్తూ సాంత్వన పొందుతుంటారు చాలా మంది. అయితే ఆసనాలు వేయాలని ఎంత కోరిక ఉన్నా శరీరం అంతగా సహకరించదు. అలాంటి వారి కోసమే ప్రత్యేక సాధనాలున్నాయి.
యోగాసనాలని సులువుగా వేసేందుకు బ్లాక్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిని రెండు వైపులా ఆసరాగా పెట్టుకుని శరీర బరువును సులువుగా పైకి లేపవచ్చు. ఇవి పట్టుజారిపోవు సరికదా తేలిగ్గానూ ఉంటాయి. వీటిని తల లేదా నడుం కింద పెట్టుకుని సులువుగా ఆసనాలు వేయొచ్చు. పూర్తిగా వంగలేకపోయినా, కింద కూర్చొలేకపోయినా వీటిని వాడొచ్చు. అలాగే ప్రత్యేకమైన చాపలూ ఉన్నాయి. మనం శరీరాన్ని వంచినప్పుడు దానికి అనుగుణంగా ఇవి కూడా కాస్త సాగుతాయి. బాగున్నాయి కదూ!
ఇదీ చదవండి:కరోనా విలయ తాండవం.. రాష్ట్రంలో 13వేలు దాటిన కేసులు