మీ సమస్యకు రెండు రకాల కారణాలుండచ్చు. మొదటిది - మీరు ఈ మధ్య శ్యానిటరీ న్యాప్‌కిన్స్ బ్రాండ్ మార్చి ఉంటే కొత్త దాని వల్ల మీకు అలర్జీ వచ్చి ఉండచ్చు. రెండోది - నిరంతరాయంగా రోజుల తరబడి ప్యాడ్స్ వాడుతున్నప్పుడు గాలి తగలక చర్మ వ్యాధులు రావడం.. అందులోనూ ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావడం వంటివి జరగచ్చు. అయితే దీన్నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
మొదటిది - మీరు క్రీమ్ వాడుతున్నానన్నారు.. క్రీమ్ బదులుగా యాంటీ ఫంగల్ డస్టింగ్ పౌడర్ దొరుకుతుంది.. బయట చర్మంపైన ఆ పౌడర్ వాడి ఆపై ప్యాడ్ పెట్టుకుంటే అది తడిని త్వరగా పీలుస్తుంది.