హలో డాక్టర్. నాకు డెలివరీ తర్వాత ట్యుబెక్టమీ చేశారు. పొట్ట తగ్గడానికి బెల్టు పెట్టుకోమన్నారు. కానీ నేను దానికి బదులు చీర ఉపయోగిస్తున్నా. దీనివల్ల నిజంగానే పొట్ట తగ్గుతుందా? మళ్లీ బెల్టు/చీర వాడడం ఆపేశాక పొట్ట పెరుగుతుందా? - ఓ సోదరి
బెల్టు వాడితే ప్రసవానంతర పొట్ట తగ్గుతుందా? - తెలంగాణ వార్తలు
ప్రసవం తర్వాత చాలామంది మహిళలకు పొట్ట వస్తుంది. రాకుండా ఉండాలంటే బెల్టు, చీర లాంటివి చాలా మంది ఉపయోగిస్తారు. అయితే వాటివల్ల శాశ్వత పరిష్కారం ఉంటుందా? బెల్టుతో పొట్టను తగ్గించవచ్చా? తెలుసుకుందాం రండి.
సర్జరీ బెల్టు ఉపయోగాలు, మహిళ ఆరోగ్య చిట్కాలు
నార్మల్ డెలివరీ/సిజేరియన్ జరిగిన వెంటనే కొద్ది రోజుల పాటు పొట్ట బాగా వదులుగా, ఎలాంటి ఆసరా లేనట్లుగా అనిపిస్తుంది. కాబట్టి బెల్టు ఉపయోగించమని డాక్టర్లు చెబుతారు. కానీ నిజానికి బెల్టు వాడడం వల్ల కండరాల్లో బలం పెరిగి తిరిగి యథాస్థితికి రావడం గానీ, పొట్ట తగ్గిపోవడం కానీ జరగదు. అలాగే బెల్టు, చీర వాడడం ఆపేశాక.. తిరిగి వదులుగానే అనిపిస్తుంది. కాబట్టి మీకు పొట్ట తగ్గిపోవాలంటే వ్యాయామం చేయడం ఒక్కటే మార్గం.
ఇదీ చదవండి:కడుపులో బిడ్డకు ఇన్ని స్కానింగ్‌లా?