బాగా పండిన బొప్పాయి గుజ్జులో ఒకట్రెండు టేబుల్ స్పూన్ల పసుపు వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని నేరుగా చర్మంపైనా, ముఖంపైన కూడా రాసుకోవచ్చు. 15 నిమిషాలుంచి కడిగేస్తే సరి. ఇలా క్రమంతప్పకుండా మూడు నెలలుపాటు వారానికి రెండుసార్లు చేయాలి. ఇలా చేయడంవల్ల రోమాలు, మృతకణాలు తగ్గి, చర్మం మృదువుగా మారుతుంది.
అవాంఛిత రోమాలు పెరగకుండా చిట్కాలు.. - Unwanted hair removal for women
కొంతమంది మహిళలకు అవాంఛిత రోమాలు వస్తుంటాయి. ఇవి చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటాయి. క్రీములూ, మందుల అవసరం లేకుండా ఇంట్లోనే వీటిని నివారించవచ్చు. ఎలా అంటే...
ఓ కప్పు పెసలు, మినుములను నీళ్లలో రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే మెత్తటి పేస్టులా రుబ్బుకోవాలి. తరువాత ఇందులో ఓ చెంచా చొప్పున బంగాళాదుంప రసం, తేనె, నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని కావాల్సిన చోట రాసుకుని ఇరవై నిమిషాలు ఆరనివ్వాలి. తరువాత వేళ్లతో నెమ్మదిగా రుద్ది కడిగేయాలి.
మొక్కజొన్న పిండిలో కొద్దిగా చక్కెర, గుడ్డు తెల్లసొన వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసి 30 నిమిషాలు ఆరనివ్వండి. ఆ తరువాత పీలాఫ్ మాస్కులా తీసేస్తే సరి. ఇది రోమాలు పెరగకుండా చేయడంతోపాటు మృతకణాలనూ తొలగిస్తుంది.