మెనోపాజ్ సమయంలో, వంశపారంపర్యమైన కారణాలు, హార్మోన్‌లలో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల కూడా ఊడుతుంది. రోజుకు 50-100 వెంట్రుకలు ఊడితే పట్టించుకోనవసరం లేదు. ఇంతకంటే ఎక్కువ ఊడితే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి.
- హార్మోన్ల తేడాలు, శరీరంలో ఇనుములేమి, విటమిన్-బి12, విటమిన్-డి3 తక్కువగా ఉన్నా, పీసీఓఎస్ సమస్య ఉన్నా జుట్టు ఊడుతుంది. తినే ఆహారంలో ఇనుము, కాపర్, విటమిన్-బి1 ఉండేలా చూసుకోవాలి. ప్రొటీన్ బానే తీసుకుంటున్నారు కాబట్టి ఒకసారి థైరాయిడ్ పరీక్ష కూడా చేయించుకోండి. ఒత్తిడి ఉన్నా, మానసిక సమస్యలున్నా కూడా జుట్టు ఊడిపోతుంది.
- జాగ్రత్తలు తీసుకోండి..
- పోషకాహార లోపం లేకుండా చూసుకోవాలి. ఇనుము ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, బీన్స్ తీసుకోవాలి. వారానికి రెండు, మూడు సార్లు చేపలు తినాలి.
- గింజలు, విత్తనాలు తినాలి. వీటిల్లో ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వాల్‌నట్స్, అవిసెగింజలు తీసుకోవాలి. పాలకూరలో ఇనుముతోపాటు విటమిన్-డి2 ఉంటుంది.
- విటమిన్-ఎ ఉండే క్యారెట్లు, గుడ్లు తీసుకోవాలి. అలాగే విటమిన్-బి12, విటమిన్-సి ఎక్కువగా ఉండే ఆహారం తినాలి.
- యోగా, ధ్యానం, వాకింగ్ లేదా వ్యాయామాలు చేయాలి. ఆర్గానిక్ హెయిర్ డైలు మాత్రమే వాడాలి. మందార ఆకులతో ప్యాక్ వేసుకుంటే వెంట్రుకలు చిట్లవు.