హాయ్ మేడం.. మా అత్తగారి వయసు 53. కంటి చుట్టూ, ముక్కు మీద మంగు మచ్చలు వచ్చాయి. అవి ఏవైనా క్రీమ్స్ వాడితే పోతాయా? లేదంటే ఏదైనా ట్రీట్‌మెంట్ తీసుకోవాలా? - ఓ సోదరి
మీరు క్రీమ్స్ వాడాలనుకుంటే డెర్మటాలజిస్ట్ దగ్గరకు వెళ్లచ్చు. లేదనుకుంటే ఇంటి చిట్కాలను ప్రయత్నించవచ్చు. ఇందులో మీరు ఏది ఎంచుకున్నా సమానమైన ఫలితం ఉంటుంది.
ఇంటి చిట్కా కోసం.. ముందుగా మీరు ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు తీసుకోవాలి. దానికి సమానమైన పరిమాణంలో అంటే టేబుల్ స్పూన్ రోజ్ వాటర్‌ని కలపండి. ఆ తర్వాత రెండు చుక్కల నిమ్మరసాన్ని కలపండి.
ఈ మూడింటినీ మిక్స్ చేసి మీకు ఎక్కడ మంగు మచ్చలున్నాయో అక్కడ అప్లై చేయండి. ఒక పది నిమిషాల తర్వాత మసాజ్ చేసుకొని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి మూడు సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.
అయితే ఈ ట్రీట్‌మెంట్‌లో భాగంగా శరీరానికి ఎండ తగలకుండా చూసుకోవాలి. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే స్కార్ఫ్ ధరించండి. అలాగే ఈ ట్రీట్‌మెంట్ తీసుకునేటప్పుడు హెయిర్ డై లాంటివి ఉపయోగించకూడదు. ఒకవేళ తప్పనిసరిగా వేసుకోవాలనుకున్నప్పుడు మంగు మచ్చలపై ఏదైనా మాయిశ్చరైజర్‌ని అప్లై చేయండి. మాయిశ్చరైజర్ లేనప్పుడు పాల మీగడను ఉపయోగించుకోవచ్చు.
-శోభారాణి, బ్యూటీఎక్స్పర్ట్
ఇదీ చదవండి:అవసరమైతే మెడికల్ కళాశాలల్లోనూ కొవిడ్ చికిత్స: ఈటల