తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

నెలసరి వచ్చినా తెలియట్లేదు.. ఇదేమైనా సమస్యా?! - periods Problems Solutions

నా స్నేహితురాలి వయసు ఇరవై ఏడేళ్లు. పెళ్లై మూడు నెలలు అవుతోంది. తనకు తెలుపు నిరంతరంగా అవుతూనే ఉంది. దాంతో చాలా అసౌకర్యంగా ఫీల్‌ అవుతోంది. అందరిలోనూ ఇలానే ఉంటుందా. ఇదేమైనా సమస్యా?

special story on Periods problems in women
నెలసరి వచ్చినా తెలియట్లేదు.. ఇదేమైనా సమస్యా?!

By

Published : Nov 11, 2020, 12:40 PM IST

గర్భాశయ ముఖ ద్వారం (సర్విక్స్‌) నుంచి తెలుపు రంగు స్రావం వెలువడటాన్ని సాధారణంగా తెల్లబట్టగా వ్యవహరిస్తారు. నెలసరిలో హార్మోన్లలో తేడాల వల్ల సర్వైకల్‌ స్రావాల్లో మార్పులు జరుగుతాయి. అధిక స్రావం, జిగురుగా ఉండటం, నెలసరికి ముందు కొద్దిగా ఈ స్రావాలు వెలువడుతూ ఉండటం లాంటివి జరుగుతాయి. దీన్నే ఫిజియోలాజికల్‌ వైట్‌ డిశ్చార్జ్‌ అంటాం. ఇది మహిళల్లో అండం విడుదలయ్యే సమయంలో, ప్రీమెనుస్ట్రువల్‌, పోస్ట్‌ మెనుస్ట్రువల్‌ టైమ్‌లో, మరికొందరికి గర్భధారణలో, ఇంకొందరికి ప్రసవమయ్యాక .... ఇలా ఒక్కొక్కరిలో ఒక్కో సమయంలో ఈ స్రావం వెలువడుతూ ఉంటుంది.

లైంగిక ఆలోచనలు వచ్చినప్పుడు కూడా సహజంగానే ఈ స్రావాలు ఉత్పన్నమవుతాయి. లైంగిక జీవితం మొదలైన తరువాత ఈ వైట్‌డిశ్చార్జ్‌లో మార్పులు కనిపిస్తాయి. ఆకుపచ్చగా, పెరుగులా, రక్తం చారలతో కూడా ఈ స్రావం వెలువడొచ్ఛు అలాగే కొన్నిసార్లు దుర్వాసన కూడా వెలువడొచ్ఛు స్రావం మోతాదు పెరిగినా, రంగు మారినా, దురదా, చెడు వాసన లాంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఒకవేళ ఇన్‌ఫెక్షన్‌ ఉంటే అది గర్భాశయ ముఖద్వారానికి మాత్రమే ఉందా? లేదా దానిపై పొరకు కూడా వ్యాపించిందా అనేది తెలుస్తుంది. అలాగే పాప్‌స్మియర్‌ పరీక్ష కూడా తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ సర్వైకల్‌, వెజైనల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ ఉన్నప్పుడు భాగస్వాములిద్దరూ మందులు వాడాలి.

ఇదీ చదవండిఃనీళ్లలో పెడితే బొమ్మొస్తుంది.. బుజ్జాయి ఏడుపు మానేస్తుంది!

ABOUT THE AUTHOR

...view details