అరకప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి కప్పు నీటిని కలిపి పొయ్యిపై ఉంచాలి. ఉడుకుతున్నప్పుడే అందులో నుంచి కొంచెం గంజిని తీసుకుని వడకట్టి చల్లార్చాలి. రెండు టేబుల్ స్పూన్ల గంజిలో తాజా కలబంద గుజ్జు టేబుల్ స్పూను, రెండు ఇ విటమిన్ ఆయిల్ క్యాప్సుల్స్‌ను కత్తిరించి ఆ నూనె వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. రాత్రి నిద్రపోయే ముందు ముఖాన్ని కడుక్కుని ఈ సీరాన్ని లేపనంలా రాసి మృదువుగా వేళ్లతో మర్దనా చేయాలి. పది నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రపరిస్తే చాలు.
అన్నం వార్చిన గంజితో ఇలా మీ సౌందర్యాన్ని పెంచుకోండి! - use rice water as pimple treatment
ఇంట్లో అన్నం వార్చే అలవాటు ఉందా? అయితే ఆ గంజిని పారేయొద్దు. అందాన్ని పెంపొందించుకోవడానికి కూడా వినియోగించొచ్చు. గంజితో చేసే సీరంని నాలుగైదు రోజులపాటు ఫ్రిజ్‌లో భద్రపరుచుకుని వాడొచ్చు. ఇది ముఖంపై ముడతలను మటుమాయం చేస్తుంది. వయసు ఛాయలను త్వరగా దరిచేరకుండా కాపాడుతుంది...
ఈ గంజి సీరంను తయారుచేసుకుని శుభ్రమైన సీసాలో నింపి ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవచ్చు. నాలుగైదు రోజులపాటు దీన్ని వినియోగించొచ్చు. గంజిలో విటమిన్ బి, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా మార్చి, బిగుతుగా ఉంచుతుంది. సూర్యకిరణాల ప్రభావం పడకుండా కాపాడుతుంది. చర్మం మంటగా అనిపించడం, దురదలతో వచ్చే దద్దుర్లు, మొటిమల నివారణకు ఇది మంచి ఔషధంలా ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జులో ఉండే వ్యాధినిరోధక కారకాల కారణంగా ముఖచర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇ విటమిన్ చర్మాన్ని తేమగా, యవ్వనంగా ఉంచుతుంది.
ఇవీ చూడండి:సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్