తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

నాజూకు నడుముకు ఈ వ్యాయామాలు ట్రై చేయండి! - exercise for slim hip

పొట్ట పెరిగితే.. చీర కట్టుకున్నా, మోడ్రన్‌ డ్రెస్‌లు వేసుకున్నా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే పొట్ట తగ్గడానికి ఈ వ్యాయామాలు చేసి చూడండి.

one should try these exercises to reduce belly fat
నాజూకు నడుముకు ఈ వ్యాయామాలు

By

Published : Sep 11, 2020, 10:59 AM IST

రెండు కాళ్లను ఎడంగా పెట్టి నిలబడాలి. ముందుగా కుడిచేతిని నడుం మీద పెట్టుకుని ఎడమచేతిని పైకి లేపి మెల్లగా కుడిపక్కకు ఒంగాలి. ఇలానే మరోవైపూ చేయాలి. ఇలా ఇరవైసార్లు చేస్తే చూడచక్కని ఆకృతి మీ సొంతమవుతుంది.

నేల మీద బోర్లా పడుకుని.. చేతుల ఆధారంగా శరీరాన్ని మెల్లగా పైకి లేపాలి. తర్వాత పాదాలను ముందుకు తీసుకొచ్ఛి... పిరుదులు పైకి వచ్చేలా ఒంగి.. తిరిగి యథాస్థితికి రావాలి. ఇలా ఓ ఇరవైసార్లు చేయాలి.

రెండు కాళ్లను దూరంగా జరిపి నిలబడాలి. చేతులనూ భుజాలకు సమాంతరంగా చాపాలి. ఇప్పుడు కుడివైపు ఓసారి, మరోసారి ఎడమవైపు తిరగాలి. ఇలా ఓ పదిహేను సార్లు చేసి చూడండి. నడుము నాజూగ్గా మారుతుంది.

ABOUT THE AUTHOR

...view details