తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

Beauty Tips: అందంగా కనిపించడానికి మీరూ ఈ పనులు చేస్తున్నారా.. అయితే జాగ్రత్త!

అందంగా కనిపించేందుకు చాలామంది తరచూ ఏవేవో ప్రయత్నాలు చేస్తారు. అందులో కొన్ని పనులు ముఖానికి మేలు చేయగా... మరికొన్ని కొత్త చిక్కుల్ని తెచ్చిపెడతాయి. అవేంటో చూద్దాం!

beauty tips, beauty issues
బ్యూటీ టిప్స్, అందానికి చిట్కాలు

By

Published : Jun 30, 2021, 1:33 PM IST

అందంగా కనిపించేందుకు తరచూ కొన్నిపనులు చేస్తుంటాం. అవి సరిగా చేయకపోతే కొత్త చిక్కుల్ని తెచ్చిపెడతాయి. అవేంటో చూద్దాం!

ల్లటి నీళ్లతో తరచూ ముఖం కడగడం మంచిదే అయినా... సబ్బుని అతిగా ఉపయోగించొద్దు. ముఖం పొడిబారుతుందనిపిస్తే... మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. లేదంటే మరింత ఎండిపోయినట్లుగా తయారవుతుంది. ఫలితంగా చిన్నవయసులోనే వృద్ధాప్య ఛాయలు పైబడతాయి.

*తరచూ క్లెన్సర్లను ఉపయోగించకండి. వాటిలోని బెంజైల్‌ పెరాక్సైడ్‌ స్కిన్‌ని ఇబ్బందికి గురిచేయొచ్చు. బదులుగా గులాబీ నీటితో తుడవండి.

*కొందరు జుట్టుకి నూనె ఎక్కువగా పెడుతుంటారు. ఇంకొందరు అసలు పెట్టరు. ఈ రెండింటివల్ల మాడు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. తలస్నానం చేయడానికి కనీసం గంటముందు నూనె పెట్టి మర్దనా చేయాలి. ఇందులోని విటమిన్లు, ఇతర మినరల్స్‌ కుదుళ్లకు పోషణ అందిస్తాయి.

*చర్మ సంరక్షణకు రకరకాల సౌందర్య ఉత్పత్తులు వాడతాం. వీటిని తరచూ మారుస్తుంటే... చర్మం పీహెచ్‌ స్థాయులని అంత వేగంగా సిద్ధం చేసుకోలేదు. అలానే ఎక్కువ రకాల్నీ ఒకేసారి వాడటమూ మంచి పద్ధతికాదు. వీలైతే చర్మ నిపుణులను కలవండి. వారు మీ చర్మతత్వానికి మేలైనవి సూచిస్తారు.

ఇదీ చదవండి:Health Tips: కీళ్ల నొప్పులకు చెక్​ పెట్టండిలా..!

ABOUT THE AUTHOR

...view details