తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

Curry Leaves : కరివేపాకుతో పోషకాహారలేమికి చెక్ - curry leaves helps for good skin

కూరలో కరివేపాకు(Curry Leaves) వేస్తే వచ్చే టేస్టే వేరప్పా. కరివేపాకుతో టేస్టే కాదు.. ఆరోగ్యమూ మన సొంతమవుతుంది. అయితే కరివేపాకుతో పోషకాహార లేమికి చెక్​ పెట్టేందుకు ఈ చిట్కాలు పాటించి చూడండి..

curry leaves, healthy curry leaves
కరివేపాకు, కరివేపాకుతో పోషకాహారలేమి, కరివేపాకుతో ఆరోగ్యం

By

Published : Jun 28, 2021, 9:25 AM IST

కారణాలు ఏవైనా ఈ తరం అమ్మాయిల్లో పోషకాహార లేమి ఎక్కువగా కనిపిస్తోంది. అది ఆరోగ్యంతో పాటు అందం మీదా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. దీనికి కరివేపాకు(Curry Leaves)తో చెక్‌పెట్టొచ్చు. అదెలాగంటే!

రివేపాకు(Curry Leaves)లో మహిళల ఆరోగ్యానికి మేలు చేసే ల్యూటిన్‌, ఫోలిక్‌యాసిడ్‌, ఇనుమూ, క్యాల్షియం, నియాసిన్‌, బీటాకెరొటిన్‌ వంటి పోషకాలెన్నో పుష్కలంగా దొరుకుతాయి. అందుకే పోషకాల లేమితో బాధపడే వారు తప్పనిసరిగా దీన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారు ఈ ఆకులను ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. ఫలితంగా నెలసరి సక్రమంగా వస్తుంది.

వేళ తప్పిన నిద్రా, తిండీ అధిక బరువు పెరిగేలా చేస్తాయి. దాన్ని అదుపులో ఉంచడానికి కరివేపాకులోని పోషకాలు కీలకంగా పనిచేస్తాయట. అలానే ఫోలిక్‌యాసిడ్‌, ఇనుమూ, క్యాల్షియం వంటి ఖనిజాలు, పోషకాలు సమపాళ్లలో శరీరానికి అందినప్పుడు జుట్టు రాలడం తగ్గుతుంది.

కరివేపాకు(Curry Leaves)లోని పీచు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మూత్ర సంబంధిత సమస్యలు, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. కంటి చూపుని మెరుగుపరుస్తాయి. తరచూ నోటిపూతతో బాధపడేవారు దీన్ని తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు.

ABOUT THE AUTHOR

...view details