సేతు బంధాసనం
నేల మీద వెల్లకిలా పడుకుని రెండు కాళ్లూ పైకి మడిచిపెట్టాలి. రెండు పాదాల మధ్య ఎడం ఉండాలి. రెండు చేతులను వెనక్కు చాపాలి. శ్వాస తీసుకుంటూ నడుమును పైకి లేపాలి. చేతులను అలాగే ఉంచి శ్వాస వదులుతూ నడుమును కిందకు దించాలి. ఇలా పదిసార్లు నిదానంగా, ప్రశాంతంగా చేయాలి.