" గర్భనిరోధక పద్ధతులు రెండు రకాలు. ఒకటి తాత్కాలిక పద్ధతి, మరొకటి శాశ్వతమైంది. ట్యూబెక్టమీ అనేది శాశ్వతమైన పద్ధతి. ఇద్దరు పిల్లలు చాలు అనుకున్నప్పుడు... మానసిక ఒత్తిళ్లు లేకుండా ఉండాలనుకుంటే ట్యూబెక్టమీ ఉత్తమమైన పద్ధతి. మీకు ఇబ్బంది అనిపిస్తే మీ భర్త వేసెక్టమీ చేయించుకోవచ్చు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఈ శస్త్రచికిత్సలు చేయించుకోవడం చాలా సులభం. భయం ఉండదు. ల్యాపరోస్కోపీ పద్ధతిలో చేసే ఈ శస్త్ర చికిత్స తర్వాత ఒక రోజులోనే మీరు ఇంటికి వెళ్లిపోవచ్చు. అలా కాకుండా తాత్కాలిక, సురక్షిత పద్ధతులు కావాలంటే... మూడేళ్ల వరకు గర్భం రాకుండా ఉండేందుకు ఇంప్లనాన్ అనే పరికరాన్ని చేతికి అమరుస్తారు. అయిదేళ్ల వరకు ఆగాలనుకుంటే గర్భాశయం(యుటరస్)లో కాపర్-టి, మెరీనా లాంటి పద్ధతులను మీరు ఎంచుకోవచ్చు. ఇవేమీ కాకుండా వైద్యుల సలహా మేరకు ఓరల్ కాంట్రాసెప్టివ్ మాత్రలు కూడా వాడొచ్చు. ఇవి సురక్షితం మాత్రమే కాదు... గర్భం వచ్చే అవకాశం కూడా తక్కువ. మీ వయసు నలభై ఏళ్లు కాబట్టి మీరు ట్యూబెక్టమీ ఎంచుకుంటే మంచిది. ఇంకా శస్త్రచికిత్స అంటే భయం ఉంటే ఇంట్రా యుటరైౖన్ డివైస్ లేదా ఇంప్లనాన్‌లను ఎంచుకోవచ్చు."
ఈ వయసులో ట్యూబెక్టమీ మంచిదేనా? - Is tubectomy good at the age of forty
నా వయసు నలభై ఏళ్లు. నాకిద్దరు పిల్లలు. ఇప్పటివరకు ఎలాంటి గర్భనిరోధక సాధనాలు వాడలేదు. ఈ వయసులో నేను ట్యూబెక్టమీ చేయించుకోవచ్చా? భయంగా ఉంది. అలా చేయించుకుంటే ఏమైనా సమస్యలు వస్తాయా? - ఓ సోదరి
![ఈ వయసులో ట్యూబెక్టమీ మంచిదేనా? Is tubectomy good at the age of forty](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8199045-1077-8199045-1595908799958.jpg)
ఈ వయసులో ట్యూబెక్టమీ మంచిదేనా?
డా. అనగాని మంజుల, గైనకాలజిస్టు