తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

నిగనిగలాడే జుట్టు కోసం ఇలా ప్రయత్నించండి...

అమ్మాయిలకు జుట్టుతోనే అందం. అందుకే వాళ్లకు జుట్టు అంటే మహాఇష్టం. ఎంతో అపురూపంగా చూసుకుంటారు. జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే వాతావరణంలోని మార్పులు వల్ల జుట్టు పొడిబారడం, రాలిపోవడం, చిట్లిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాకాకూడదంటే కొన్ని జాగ్త్రతలు తప్పనిసరి....

healthy hair tips for women
healthy hair tips for women

By

Published : Jun 28, 2020, 10:24 AM IST

  • కాలంతో పనిలేకుండా చాలామంది వేడి వేడి నీళ్లతో తలస్నానం చేస్తుంటారు. ఇది కురులకు హానికరం. గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి. తరచూ షాంపూలతో తలస్నానం చేయడం వల్ల కొన్నిసార్లు హానికర వ్యర్థాలు తలలో పేరుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే నెలలో ఒకటి రెండు సార్లు కుంకుడుకాయ వాడాలి. దీనివల్ల జుట్టు బరకగా అవుతుందనుకుంటే మందారాకులు వేసి తలస్నానం చేయాలి.
  • ఈ కాలంలో తరచూ తడవడం వల్ల జుట్టు తేమను కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. అందుకే తలస్నానం చేసే ప్రతిసారీ ముందు ఇలా చేయండి. కప్పు కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరం వేసి మరగనివ్వాలి. అది గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు పట్టించి మర్దన చేయడం మంచిది. మాడుకి రక్తప్రసరణ సరిగ్గా జరిగి జుట్టు నిగనిగలాడుతుంది.
  • శిరోజాల చివర్లు పొడిబారి చిట్లిపోతుంటే.. పెరుగులో చెంచా నిమ్మరసం, గుడ్డులోని తెల్లసొన, ఆలివ్‌ నూనె, అరటిపండు గుజ్జు కలిపి కురులకు పట్టించాలి. ఇలా వారానికోసారి చేస్తూ ఉంటే ఈ సమస్య దూరమవుతుంది.

ABOUT THE AUTHOR

...view details