తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

జుట్టు నిగారింపుతో మెరిసిపోవాలంటే... ఇలా చేయాలి! - hair precautions

పని ఒత్తిడి, ఇంటి బాధ్యతలు ఏవైతేనేం జుట్టుకి తగిన సంరక్షణ చేసే సమయం చిక్కదు. అలాగని వదిలేస్తే...మరింత నిర్జీవంగా మారుతుంది. ఇలాంటప్పుడు కొబ్బరిపాలతో తగిన పోషణ అందిస్తే...కళగా కనిపిస్తుంది. అందుకోసం ఏం చేయాలంటే...

జుట్టు నిగారింపుతో మెరిసిపోవాలంటే... తలస్నానానికి కొబ్బరి పాలు...
జుట్టు నిగారింపుతో మెరిసిపోవాలంటే... తలస్నానానికి కొబ్బరి పాలు...

By

Published : Aug 6, 2020, 12:57 PM IST

కొబ్బరిలో ఉండే ప్రొటీన్‌, విటమిన్లు... వెంట్రుకలు, మాడుని ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే తలస్నానం చేయడానికి అరగంట ముందు ఇలా చేయండి. అరగ్లాసు కొబ్బరి పాలల్లో, పావుకప్పు కలబంద గుజ్జు కలపండి. దీన్ని తలకు పట్టించాలి. ఆపై షవర్‌క్యాప్‌ పెట్టి అరగంటైనా ఆరనివ్వాలి. ఇలా చేయడంవల్ల జుట్టుకి తగిన తేమ అందుతుంది. మాడుపై ఉండే సహజ నూనెలు భద్రంగా ఉంటాయి. ఫలితంగా జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది.

*● కప్పు మునగాకు పేస్ట్‌లో పావుకప్పు కొబ్బరి పాలు కలపాలి. దీనికి చెంచా ఆలివ్‌ నూనె చేర్చి తలకు పట్టించాలి. ఇది ఓ అరగంట ఆరాక గోరువెచ్చని నీళ్లు, గాఢత తక్కువగా షాంపూతో తలస్నానం చేస్తే సరి జుట్టు నిగారింపుతో మెరిసిపోతుంది.

*● పావుకప్పు కొబ్బరి పాలల్లో రెండు చెంచాల మెంతుల్ని రెండు మూడు గంటలు నాననివ్వాలి. ఈ మిశ్రమాన్ని రుబ్బి దానికి గుడ్డు తెల్ల సొన చేర్చాలి. దీన్ని తలకు పెట్టుకుని ఆరనిచ్చి స్నానం చేయాలి. చుండ్రు సమస్య దరిచేరదు.

ABOUT THE AUTHOR

...view details