తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

HAIR LOSS: నుదురు దగ్గర్లో వెంట్రుకలు ఎక్కువగా రాలితే..? - వెంట్రుకలు ఊడుతుంటే

మా అమ్మాయికి పదకొండేళ్లు. జుట్టు బాగా ఊడుతోంది. ముఖ్యంగా నుదురు దగ్గర్లో వెంట్రుకలు ఎక్కువగా రాలుతున్నాయి. పరిష్కారం చెప్పండి. - ఓ సోదరి

hair-loss-reasons-and-hair-growth-tips-ladies
HAIR LOSS: నుదురు దగ్గర్లో వెంట్రుకలు ఎక్కువగా రాలితే..?

By

Published : Jun 24, 2021, 12:44 PM IST

ఏ ఆరోగ్య సమస్యా లేకుండా జుట్టు ఊడుతోంటే.. వంశపారంపర్యమని భావించొచ్చు. పిల్లల్లో నుదురు చిన్నగానే ఉంటుంది. పెరిగే కొద్దీ ఆ భాగం పైకి వెళుతూ ఉంటుంది. ఇది సాధారణమే. దాన్ని జుట్టు ఊడటంగా భావించం. కుటుంబంలో ఎవరికైనా జుట్టు పైకి ఉంటే.. పిల్లల్లోనూ అలా మారే అవకాశం ఉంటుంది. సమస్య మరీ ఎక్కువగా ఉంటే ఐరన్‌, పోషకాహార లోపం కానీ, థైరాయిడ్‌ సమస్య కానీ ఉందేమో చూసుకోవాలి. ఎదిగే పిల్లల్లోనూ ఒత్తిడి ఉంటుంది. దాన్నీ చెక్‌ చేసుకోవాలి. రజస్వల అయితే పీసీఓస్‌ సమస్య ఉందేమో చూసుకోవాలి. మామూలుగా 50 -100 వెంట్రుకలు ఊడటం సాధారణమే. అంతకన్నా ఎక్కువగా ఉంటే వైద్యుణ్ని సంప్రదించాలి. ఒత్తిడి ఉందనిపిస్తే తగ్గించే ప్రయత్నం చేయాలి.

వాతావరణం అంటే.. ఎక్కువ వేడి చలిలో ఉన్నా, టైఫాయిడ్‌, మలేరియా, వైరల్‌ ఫీవర్‌ వచ్చి తగ్గినా జుట్టు ఊడుతుంది. ఐరన్‌, జింక్‌, విటమిన్‌ బి6, బి12 తగినంత అందుతున్నాయో లేదో చూసుకోవాలి. సంబంధిత పరీక్షలు చేయించొచ్చు. అన్నీ సరిగా ఉంటే కంగారు పడక్కర్లేదు. డ్రైయర్‌ వాడకం, స్ట్రెయిటనింగ్‌, గట్టిగా అల్లడం వంటివీ జుట్టు రాలడానికి కారణమవుతాయి. హార్మోన్లు మారుతున్నాయేమో కూడా చూసుకోవాలి. జంక్‌ఫుడ్‌ ఎక్కువగా ఇస్తున్నారా పరిశీలించండి. ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉండే చేపలు, నట్స్‌, ఐరన్‌, విటమిన్‌ డి2 ఉండే పాలకూర, గుమ్మడి, కొబ్బరిపాలు వంటివి ఇవ్వాలి. అవిసెలు, పొద్దు తిరుగుడు గింజలతోపాటు ఆకుకూరలు, క్యారెట్‌, గుడ్లనూ డైట్‌లో చేర్చండి. కూరగాయలు, పండ్లతో పాటు కనీసం 2 లీటర్ల నీళ్లు తీసుకోవాలి. రోజూ వ్యాయామం చేసేలా ప్రోత్సహించండి. ఒత్తిడి తగ్గించడంతోపాటు జుట్టు పెరిగేలా ఇది ప్రోత్సహిస్తుంది. వారానికోసారి నూనెతో తలను మసాజ్‌ చేస్తూ రసాయనాలు లేని షాంపూలను వాడండి.

ఇదీ చూడండి:TET: 'టెట్‌'లో సంస్కరణలు అవసరం

ABOUT THE AUTHOR

...view details