తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదా? మందులు వాడాల్సిందేనా? - gynecologists' solution pcos problem

పీసీఓఎస్‌ సమస్యతో బాధపడుతున్నవారికి నెలసరి క్రమంగా రావట్లేదని... వైద్యులను సంప్రదిస్తే హార్మోన్ల అసమతుల్యత అని చెప్పారు. మందులు వాడాక కొన్నాళ్లు పీరియడ్‌ క్రమం తప్పకుండా మానేశాక మళ్లీ మామూలేనని ఓ సోదరి బాధపడింది. ముఖంపై మొటిమలు, అవాంఛిత రోమాలూ వస్తున్నాయి. నా సమస్య తగ్గేదెలా? అంటూ అడగగా.. ప్రముఖ గైనకాలజిస్టు అనగాని మంజుల ఇలా సూచించారు.

gynecologists' solution for women pcos problem
ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదా? మందులు వాడాల్సిందేనా?

By

Published : Sep 19, 2020, 1:15 PM IST

పీసీఓఎస్‌ వల్ల శరీరంలో చాలా రకాల మార్పులొస్తాయి. అందులో ఒకటి...హార్మోన్ల అసమతుల్యత. రెండోది... ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ పెరగడం. మూడోది... శరీరంలో ఆండ్రోజెన్‌ హార్మోన్‌ ఎక్కువ అవడం. వీటన్నింటి వల్ల ఊబకాయం, ముఖంపై మొటిమలు, అవాంఛిత రోమాలు రావడం, నెలసరి క్రమం తప్పడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. కొందరిలో ‘కుంగుబాటు’ కూడా కనిపిస్తుంది. వీటన్నింటినీ నియంత్రించాలంటే ముందు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి.

అందుకోసం యోగా, ధ్యానం, డ్యాన్స్‌, మ్యూజిక్‌...వంటి వ్యాపకాల్ని కల్పించుకుని క్రమం తప్పకుండా సాధన చేయండి. రెండోది శరీరంలోని కండరాలన్నీ ఉత్తేజితమయ్యేలా వ్యాయామం చేయాలి. మూడోది ఆహారంలో మార్పులు చేసుకోవాలి. పిండిపదార్థాలు తక్కువగా, మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి, కొవ్వులూ మోతాదుకు మించకూడదు. ఈ మూడు మార్పులు చేసుకుంటూ, వైద్యుల సలహాలు, సూచనలతో మందులు వాడితే ఈ సమస్య అధిగమించొచ్ఛు శరీరం బరువులో కనీసం పదిశాతం తగ్గినా హార్మోన్ల అసమతుల్యత సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు ఎక్కువ.

ఇదీ చూడండి:చిర్రుబుర్రులొద్దు... సరదాలే ముద్దు..!

ABOUT THE AUTHOR

...view details