హలో డాక్టర్. నా వయసు 22. ఎత్తు 5’3’’. బరువు 55 కిలోలు. నాకు పీసీఓఎస్ ఉంది. డాక్టర్ మూడు నెలల కోర్సు ఇచ్చారు. ఈ కోర్సు పూర్తయిన తర్వాత రెండు నెలలు పిరియడ్స్ బాగానే వచ్చాయి. ఆ తర్వాత ఒక నెల పిరియడ్స్ రాలేదు. తర్వాతి నెలలో వచ్చినా బ్లీడింగ్ అవ్వలేదు. ఆపై నెలలో పిరియడ్స్ రెండు రోజుల ముందే వచ్చాయి.. పది రోజుల పాటు బ్లీడింగ్ అయింది. కానీ ఇప్పుడు ఐదు రోజుల ముందే నెలసరి వచ్చింది.. బ్లీడింగ్ ఎక్కువగా ఉంది.. ఇలా పిరియడ్స్ విషయంలో రెగ్యులారిటీ అంటూ లేదు. బ్లీడింగ్ కూడా విపరీతంగా అవుతోంది.. నా సమస్యకు పరిష్కారమేంటి? - ఓ సోదరి
విపరీతంగా బ్లీడింగ్ అవుతోంది.. పరిష్కారమేంటి? - gynecologist advice on over bleeding
నెలసరి ముందూ వెనుక గానీ, బ్లీడింగ్‌లో హెచ్చుతగ్గులు జరుగుతున్నాయా..? విపరీతంగా బ్లీడింగ్ అవుతోందా...? అయితే తదితర వివరాలపై గైనాకాలజిస్ట్ నిపుణులు సవితాదేవి కొన్ని విషయాలు తెలిపారు. అవేంటో చూడండి.
విపరీతంగా బ్లీడింగ్ అవుతోంది.. పరిష్కారమేంటి?
జ: మీకు ఇప్పటికే పీసీఓఎస్ ఉందని నిర్ధారణ జరిగింది. మీరు మూడు నెలల కోర్సు కూడా వాడానని రాశారు. అయితే పీసీఓఎస్ ఉన్న వారికి హార్మోన్ల అసమతుల్యత వల్ల నెలసరి ముందూ వెనుక గానీ, బ్లీడింగ్‌లో హెచ్చుతగ్గులు గానీ జరగొచ్చు. పీసీఓఎస్ అనేది కొద్ది నెలల చికిత్సతో పూర్తిగా నయమైపోయే వ్యాధి కాదు. ఈ అసమతుల్యత జీవితాంతం ఉంటుంది. అందుకని డాక్టర్ల పర్యవేక్షణలో దీర్ఘకాలికంగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
- ఇదీ చదవండి:'అంతర్జాతీయ రోదసి హబ్‌గా భారత్ ఎదుగుతుంది'