తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

పదే పదే గర్భస్రావం.. ప్రమాదమా? - తెలంగాణ వార్తలు

ఇటీవల కాలంలో చాలామంది మహిళలు గర్భస్రావం బారిన పడుతున్నారు. అందుకు మారిన వాతావరణ పరిస్థితులు, కలుషిత ఆహారం, ఆహారపు అలవాట్లు వంటి ఎన్నో కారణాలు ఉంటాయని అంటున్నారు డాక్టర్లు. మరి పదేపదే గర్బస్రావం వల్ల మహిళకు ఏమైనా ప్రమాదమా? అలా జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం.

frequent abortions effect, tips for women health
గర్భస్రావం వల్ల ప్రభావాలు, గర్భస్రావంపై డాక్టర్ల సలహాలు

By

Published : Mar 31, 2021, 1:23 PM IST

నమస్తే డాక్టర్‌. నాకు ఇద్దరు పిల్లలు. బాబుకు రెండేళ్లు, పాపకు 11 నెలలు. రెండు కాన్పులు సిజేరియన్‌ ద్వారా జరిగాయి. నేను కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకోలేదు. మాత్రల ద్వారా ఈ జనవరిలో ఒకసారి గర్భస్రావం అయింది. మళ్లీ ఇప్పుడు కూడా అలాగే అబార్షన్‌ అయింది. పదే పదే ఇలా జరగడం ఆరోగ్యానికి ప్రమాదమా?

-ఓ సోదరి

మీరు రాసిన దాన్ని బట్టి మీరు రెండుసార్లు అవాంఛిత గర్భం వల్ల మాత్రలు వాడి గర్భస్రావం చేయించుకున్నారని అర్థమవుతుంది. పదే పదే ఇలా జరగడం కచ్చితంగా ఆరోగ్యానికి ప్రమాదమే. మీరు ఇకపై పిల్లలు వద్దు అని అనుకుంటే పాపకు మూడు నాలుగేళ్లు వచ్చే వరకు తాత్కాలికమైన ఫ్యామిలీ ప్లానింగ్‌ పద్ధతులు అనుసరించచ్చు. ఉదాహరణకు.. నోటి మాత్రలు కానీ, కాపర్‌-టి కానీ వాడడం వల్ల అవాంఛిత గర్భం రాకుండా చూసుకోవచ్చు. మీరు శాశ్వతమైన కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకోవాలనుకుంటే మాత్రం మీ పాప కాస్త పెరిగి ఆరోగ్యంగానే ఉంది అని అనుకున్నప్పుడు ల్యాప్రోస్కోపిక్‌ పద్ధతి ద్వారా ట్యుబెక్టమీ చేయించుకోవచ్చు.

-డా.వై.సవితాదేవి, గైనకాలజిస్ట్

ఇదీ చదవండి:మా పాపకి ఆ విషయాల గురించి చెప్పొచ్చా?

ABOUT THE AUTHOR

...view details