చాలామంది జుట్టుకి నూనె అస్సలు పెట్టరు. దీనివల్ల జుట్టు మరింత పొడిబారిపోతుంది. నిర్జీవంగా మారుతుంది. తలస్నానం చేయడానికి రెండు గంటల ముందు కొబ్బరినూనె, ఆముదం వేడిచేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు రాసుకోవాలి. రెండు నిమిషాలాగి వేళ్లతో మర్దన చేయాలి. దీంతో జుట్టుకి కావాల్సిన తేమ అందుతుంది. చివర్లు చిట్లిపోయే సమస్యా తగ్గుతుంది.
* చాలామంది హెన్నా, ఇతరత్రా హెయిర్ ప్యాక్‌లు తలకు పెట్టుకుంటారు. వాటిని ఎక్కువ సమయం అలానే ఉంచేస్తారు. మీరు అలా చేయొద్దు. గంట తరువాత తప్పనిసరిగా దాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ఏ మాత్రం వాటి తాలూకు అవశేషాలు మిగిలిపోయినా మాడుపై మురికి చేరి చుండ్రు వచ్చే అవకాశం ఎక్కువ. చివరగా గాఢత తక్కువగా ఉండే షాంపూని వినియోగించి తలస్నానం చేయండి. తడిగా ఉన్నప్పుడే కండిషనర్ రాసుకోండి.
* జుట్టు తడిగా ఉంటే.. దుమ్ముని తొందరగా ఆకర్షిస్తుంది. ఇది మాడుపై చేరి వెంట్రుకల్ని బలహీనం చేస్తుంది. అలాగే జుట్టు ఆరక ముందే జడ వేసుకుంటే చుండ్రు వచ్చే అవకాశం ఎక్కువ.
జుట్టు పొడిబారకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
కొందరి జుట్టు మరీ పొడిబారినట్లు కనిపిస్తుంది. తలస్నానం చేసిన రెండు రోజులకే జిడ్డుగానూ మారుతుంది. దానికోసం ఈ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
జుట్టు పొడిబారకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
ఇదీ చూడండి:మీకు ఒత్తైన జుట్టు కావాలనుకుంటున్నారా?