తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

Health Tips: దీర్ఘకాలం వాడుతున్నారా? అయితే జాగ్రత్త! - చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా

అందంగా కనిపించాలని రోజూ వాడే కొన్నింటివల్ల దీర్ఘకాలంలో అనారోగ్యాల ముప్పు ఉండొచ్చు. అవేంటో తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. మేలు. అవేంటంటే!

makeup
అందంగా కనిపించాలంటే

By

Published : Jul 6, 2021, 11:01 AM IST

పరిశుభ్రంగా...

సందర్భం ఎంత చిన్నదైనా... మోముని మెరిపించుకోవడానికి ఇప్పుడు అందరూ తప్పనిసరిగా మేకప్‌ని వాడుతున్నారు. నాణ్యమైన ఉత్పత్తులు వాడకపోయినా పర్వాలేదు కానీ.. గడువు దాటినవీ, ఇతరులవీ వాడితే చర్మ సంబంధిత సమస్యలు రావొచ్చు. అలానే ఎక్కువ సమయం ఉంచుకోవడం, రాత్రి తొలగించుకోకుండా పడుకోవడం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. వీలైనంత తక్కువగా మేకప్‌ వేసుకోవడంతో పాటు... నాణ్యమైన రకాల్ని పరిశుభ్రమైన విధానాల్లో వాడటం మంచిది.

వదులుగా...

శరీరానికి అతుక్కుపోయేలా ఉండే డ్రెస్‌లు, లెగ్గింగ్‌లు, ప్యాంట్లు ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు. చెమట వల్ల చర్మ, తదితర సమస్యలు రావొచ్చు. క్లోజ్డ్‌ ఫిట్టింగ్‌ స్కర్టులు, బాడీషేపర్ల వల్ల నరాలు, కండరాల నొప్పులు, డిస్క్‌ సమస్యలు రావొచ్చు. వీలైనంతవరకూ వీటి జోలికి పోవద్దు. కాస్త వదులుగా ఉండేలా చూసుకోవడం వల్ల ఈ ఇబ్బందిని తొలగించుకోవచ్చు.

వార్డ్‌రోబ్‌లో వదులైన దుస్తులుండాలి..

తక్కువ సమయం...

ట్రెండ్‌, మ్యాచింగ్‌ల పేరుతో ఫ్యాషన్‌ జ్యూయలరీని విరివిగా వాడుతోంది ఈ తరం. కొందరిలో అలర్జీల కారణంగా ఆ ప్రాంతంలో కమిలిపోవడం, నల్లగా మారడం, చీము పట్టడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక బరువైనవి ఎంచుకోవడం వల్ల చెవి తమ్మి సాగిపోయే ప్రమాదం ఉంది. గిల్టు నగలు పడనివారు... నేరుగా పెట్టుకోకుండా వాటి శీలలకు నెయిల్‌పెయింట్‌ వేయడం వల్ల కొంతవరకూ ప్రభావాన్ని తగ్గించొచ్చు. బరువైనవాటిని తక్కువ సమయం మాత్రమే ధరించేలా చూసుకోండి.

300 రూపాయలతో బయటకొచ్చి...30 కోట్ల టర్నోవర్‌ చేశా!

బరువొద్దు...

ఇప్పుడు అందరికీ హ్యాండ్‌ బ్యాగ్‌ నిత్యావసరం అయిపోయింది. కానీ కొందరి బ్యాగు చూస్తే కనీసం మూడు నుంచి ఐదు కిలోల బరువుంటుంది. కనిపించిన ప్రతివస్తువూ ముఖ్యమే అనుకుని వెంట పెట్టుకుని తిరగడమే ఇందుకు కారణం. అలా కాకుండా తక్కువ బరువు ఉండేలా చూస్తే భుజాల వద్ద ప్రెజర్​ లేకుండా ఉంటుంది.

అందమైన భామలు మెచ్చే హ్యాండ్​బ్యాగులు

ఫలితంగా ...

హ్యాండ్​ బ్యాగ్​ బరువు ఎక్కువైతే.. మెడ, భుజాలు, వెన్నుపై తీవ్ర ప్రభావం పడొచ్చు. అందుకే వీలైనంత తేలిగ్గా ఉండేలా చూసుకోండి.

ఎత్తొద్దు...

ఎత్తు చెప్పుల్ని దీర్ఘకాలం వాడితే పాదాల ఆరోగ్యం దెబ్బతింటుంది. రక్తప్రసరణలో హెచ్చు తగ్గుల వల్ల మడమలు, కీళ్లు, కండరాల నొప్పులు తీవ్రమవుతాయి. నడవడానికే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎక్కువ సమయం వాడొద్దు. అవకాశం ఉన్నప్పుడు వాటిని తీసి పక్కన పెట్టి వట్టి పాదాలతోనే నడవడం మంచిది. దూర ప్రయాణాల్లో వీటికి ప్రాధాన్యం ఇవ్వొద్దు. సరైన రోడ్లు లేని చోట్ల కూడా వాడకపోవడమే మంచిది.

ఇదీ చూడండి:జంతు సంరక్షణ మానవాళికి రక్షాకవచం

ఇంట్లో నడిచేటప్పుడు కూడా చెప్పులెందుకు వేసుకోవాలో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details