- చాలామంది నేరుగా షాంపూని తలకు పెట్టుకుంటారు. దీనివల్ల వాటిల్లోని పీపీడీ, అమ్మోనియా వంటి రసాయనాలు వెంట్రుకలకు హాని కలిగిస్తాయి. పైగా పీహెచ్ శాతం ఎక్కువ ఉండటం వల్ల జుట్టు పొడిబారి చిట్లే సమస్య ఎదురవుతుంది. అందుకే గాఢత తక్కువగా ఉండే షాంపూలను ఎంచుకోవడంతో పాటు, నీళ్లల్లో కలిపి దాన్ని వాడటం మేలు. వారంలో మూడు రోజులకు మించి షాంపూ వాడకపోవడమే మంచిది.
- ఎక్కువగా యువత చేసే పొరబాటు తడి జుట్టుని సహజంగా ఆరబెట్టడానికి బదులు డ్రయ్యర్‌నీ వాడుతుంటారు. చిన్న చిన్న సందర్భాలకూ వెంట్రుకలు మృదువుగా కనిపించాలని స్ట్రెయిటనర్‌నీ వినియోగిస్తారు. ఆయా ఉత్పత్తుల నుంచి వచ్చే మితిమీరిన వేడి తాత్కాలికంగా అందాన్నీ, సౌకర్యాన్నీ అందిస్తుంది. అయితే దీర్ఘకాలంలో మాత్రం మాడుపై విడుదలయ్యే నూనెల్నీ, తేమనీ తగ్గించి జుట్టుని పొడిబారేలా చేస్తుంది. ఫలితంగా జుట్టు రాలుతుంది. వీలైనంతవరకూ జుట్టుని సహజంగా ఆరబెట్టుకోవాలి. తప్పనిసరిగా స్ట్రెయిటనర్‌ని వాడాల్సి వస్తే తరువాత రోజు జుట్టుకి తగిన పోషణ అందించాలి. వీలైనంతవరకూ నెలలో మూడు, నాలుగు సార్ల కంటే ఎక్కువసార్లు వీటిని వినియోగించకపోవడమే మేలు.
- జుట్టు సులభంగా చిక్కులు విడిపోతుంది కదాని! తల తడి ఆరకుండానే దువ్వేస్తుంటారు. దీనివల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. తడిజుట్టు చాలా బలహీనంగా ఉంటుంది. అందుకే దువ్వెనతో బలం ఉపయోగించి లాగడం వల్ల తెగిపోయి వచ్చేస్తుంది. జుట్టును గాలికి ఆరనిచ్చి ఆ తరువాతే పెద్ద పళ్లున్న దువ్వెనతో దువ్వాలి. జడ వేసుకోవాలి.
కురులు నిగనిగలాడాలంటే... ఇలా చేయండి - జుట్టుకు టిప్స్
జుట్టు రాలిపోవడానికి అన్నిసార్లూ పోషకాల లోపం, అనారోగ్యాలే కారణం కాకపోవచ్చు. నిత్యం మనం చేసే పొరబాట్లూ తోడవ్వచ్చు. అవేంటి? అలాకాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
hair tips