తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

చర్మాన్ని కాన్వాస్​లా మార్చి.. చిత్రాలు గీస్తోంది! - Denmark girl is drawing on her skin

డెన్మార్క్‌కు చెందిన 18 ఏళ్ల అల్డెన్‌ రైడ్‌ చిత్రమైన అలర్జీతో బాధపడుతోంది. ఆమె చర్మాన్ని తాకితే చాలు అక్కడ బొబ్బలా పొంగిపోతుంది. ఈ సమస్యను తనకు అనుకూలంగా మార్చుకున్న అల్డెన్ చర్మాన్ని కాన్వాస్​లా వాడేస్తోంది.

Denmark girl is suffering from allergy and turned her skin into canvas
చర్మంపై చిత్రాలు గీస్తున్న డెన్మార్క్ యువతి

By

Published : Sep 14, 2020, 2:59 PM IST

డెన్మార్క్‌కు చెందిన 18 ఏళ్ల అల్డెన్‌ రైడ్‌ చిత్రమైన అలర్జీతో బాధపడుతోంది. ఆమె చర్మాన్ని తాకితే చాలు అక్కడ బొబ్బలా పొంగిపోతుంది. ఈ టచ్‌ అలర్జీని వైద్య పరిభాషలో డెర్మాటోగ్రాఫియా అంటారు. ఈ సమస్య వల్ల అల్డెన్‌ దుస్తులు ధరించినా సరే ఆ రాపిడికి చర్మం దద్దుర్లు వచ్చేస్తుంది. అలాగని ఆ సమస్యతో ఆమెకి నొప్పి, మంట వంటివేమీ ఉండవు. గంట తరవాత చర్మం మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది.

ఐదేళ్ల క్రితం ఈ సమస్య బారిన పడిన అల్డెన్‌ ఈ మధ్య తన చర్మాన్ని కాన్వాస్‌లా మార్చేసుకుంది. చర్మాన్ని తాకుతూ రకరకాల బొమ్మలు గీస్తూ వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తోంది. అయితే చికిత్స తీసుకుంటే సమస్య నయమవుతుంది కానీ... చర్మంపై బొమ్మలు గీయడం కుదరదని అల్డెన్‌ వైద్యానికి దూరంగా ఉంటోందట.

ABOUT THE AUTHOR

...view details